Flipkart ‌ గుడ్ న్యూస్.. ఇక 90 నిమిషాల్లోనే డెలివరీ!


ఫ్లిప్‌కార్ట్ తాజాగా అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటి సంస్థలకు ఝలక్ ఇచ్చింది. తాను
కూడా క్విక్ డెలివరీ సర్వీసులు లాంచ్ చేసింది. 90 నిమిషాల్లోనే కస్టమర్లకు
డెలివరీ అందిస్తామని పేర్కొంది.
దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది.
కస్టమర్లకు త్వరితగతి డెలివరీ అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ రెడీ అయ్యింది. 90
నిమిషాల్లోనే డెలివరీ అందిస్తున్నామని ప్రకటించింది. గ్రాసరీస్, హోమ్
యాక్ససిరీస్‌లను కొనుగోలు చేస్తే కేవలం గంటన్నరలోనే డెలివరీ పొందొచ్చని
తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ ప్రధాన ప్రత్యర్థి అమెజాన్. అమెజాన్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు
ఫ్లిప్‌కార్ట్ ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఫ్లిప్‌కార్ట్ క్విక్
పేరుతో ఈ హైపర్ లోకల్ సర్వీసులు ఆఫర్ చేయనుంది. కేవలం గ్రాసరీస్ మాత్రమే కాకుండా
రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్లను కూడా వేగంగానే డెలివరీ చేస్తామని పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీసులును కంపెనీ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అయితే
ఇవి అన్ని ప్రాంతాల్లో ఇంకా అందుబాటులో లేవు. కేవలం బెంగళూరులోని కొన్ని
లొకేషన్లలో క్విక్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇవి
దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. కంపెనీ ఎప్పుడు వీటిని అందరికీ అందిస్తుందో
కచ్చితంగా తెలియదు.
ప్రస్తుతం బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సంస్థలు గ్రాసరీస్‌లను క్విక్ డెలివరీ
చేస్తున్నాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ సర్వీసులను ఆఫర్ చేయబోతోంది. దీంతో
వీటిని ప్రత్యక్షంగానే పోటీ ఎదురుకానుంది. జియో మార్ట్‌కు కూడా ఫ్లిప్‌కార్ట ఝలక్
ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
గూగుల్‌కు చెందిన డుంజో, స్విగ్గీ కూడా భారత్‌లో గ్రాసరీ‌స్‌ను డెలివరీ
చేస్తున్నాయి. కరోనా వైరస్ సమయంలో గ్రాసరీస్ ఆన్‌లైన్ డెలివరీకి ఫుల్ డిమాండ్
నెలకొంద
Flash...   Google Pay , Phone Pe వినియోగదారులకు బిగ్ షాక్.. సిద్ధంగా ఉండండి!