GOOD NEWS: అమెరికా కంటే మనవద్ద కరోనా ఔషధం ధర 80% తక్కువ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎందరో
శాస్త్రవేత్తలు ఈ వైరస్ వ్యాక్సీన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. తాజాగా
దేశీయ ఫార్మా దిగ్గజం మైలాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో రెమ్‌డెసివిర్‌కు తమ
జనరిక్ వర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో దీనిని డెస్రం
పేరుతో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా
540,764 మంది మృత్యువాత పడగా, ఇందులో మన దేశం నుండి 20,174 ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 11,744,397 కేసులు, దేశంలో 720,346 కేసులు నమోదయ్యాయి.
ధర రూ.4,800 కరోనా బాధితుల అత్యవసర చికిత్స కోసం రెమ్‌డెసివిర్ జనరిక్ ఔషధాన్ని
తయారు చేసి, విక్రయించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి
మైలాన్ అనుమతి పొందింది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. 100 మిల్లీగ్రాముల
ఇంజెక్షన్(వయల్) ధరను రూ.4,800గా(64.31 డాలర్లు) ఉంటుందని తెలిపింది. ఈనెల్లో
డెస్రం బ్రాండ్ పేరుతో దీనిని తీసుకొస్తున్నామని పేర్కొంది.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ వెల్దీ నేషన్స్‌తో పోలిస్తే
మైలాన్ వ్యాక్సీన్ ధర 80 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. అభివృద్ధి చెందిన
దేశాల్లో ఈ బ్రాండెడ్ ఔషధాన్ని ప్రభుత్వాలకు విక్రయిస్తున్న దాంతో పోలిస్తే చాలా
తక్కువకే దేశీయంగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఔషధ తయారీ,
విక్రయాలకు దేశీయంగా సిప్లా(సిప్రెమి), హెటిరో (కోవిఫర్) వంటి సంస్థలు DCGI
అనుమతులు పొందాయి. సిప్రెమి ధర రూ.5,000 కాగా, కోవిఫర్ ధర రూ.5,400. విదేశీ ధరలతో
పోలిస్తే మనవద్ద అన్ని ధరలు తక్కువే. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారు,
ప్రయోగశాలల ద్వారా నిర్ధరాణ అయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఈ ఔషధం
వినియోగించవచ్చునని తెలిపింది.
ధనిక దేశాల్లో రూ.2,340 డాలర్లు కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్ సంస్థ ప్రపంచంలోని
127 అభివృద్ధి చెందుతున్న దేశాలలో రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉంచే ప్రయత్నంలో
భాగంగా పలు జనరిక్ ఔషధ తయారీదారులతో లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. గత
వారం గిలీడ్ ధనిక దేశాల్లోని రోగికి రెమ్‌డెసివిర్ ధరను 2,340 డాలర్లుగా
నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో తమ సరఫరాను అమెరికాకు పంపిస్తామని
ప్రకటించింది.
Flash...   ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా:
5 రోజుల ట్రీట్మెంట్ కోర్స్.. 6 వయల్స్ ప్రస్తుతం మైలాన్ 100 మిల్లీగ్రాముల వయల్
ధరని 64.31 డాలర్లుగా ప్రకటించింది. అయితే ట్రీట్మెంట్ కోర్సుకు ఎన్ని వయల్స్
అవసరమో తెలియరాలేదు. గిలీడ్ ప్రకారం 5 రోజుల ట్రీట్మెంట్ కోర్స్ కోసం 6 వయల్స్
రెమ్‌డెసివిర్ అవసరం. కరోనా రికవరికీ ఉపయోగపడుతున్న రెమ్‌డెసివిర్ డిమాండ్
పెరిగింది. అయితే సరఫరా గురించి ఆందోళనలు ఉన్నాయి.