H 1Bవీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పిన AMERICA

అమెరికా గవర్నమెంట్ హెచ్1బీ, ఇతర వర్క్‌ వీసా హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా
సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా
హోల్డర్ల భార్య లేదా భర్త, ఇతర ఆధారితులు ఇండియా నుంచి తిరిగి అమెరికాకు
రావొచ్చని అనుమతులు ఇచ్చింది.దీనికి సంబంధించి వారు వీసా స్టాంపింగ్‌
చేసుకోవచ్చని ప్రకటించింది.

హెచ్‌1బీ వీసాదారుని లైఫ్ పార్టనర్ లేదా బిడ్డలు, పేరెంట్స్ తిరిగి అమెరికాకు
చేరుకోవచ్చని ప్రకటించి వారికి భారీ ఊరట కల్పించింది. హెచ్2బీ, హెచ్4తో సహా
వివిధవలసేతర వీసాల నిషేధంపై మినహాయింపు ప్రకటించింది. తాజా ఆదేశాల ప్రకారం
ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్‌1బీ, వీసాదారుడి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు
(భారతదేశంలో చిక్కుకు పోయిన) తిరిగి అమెరికా వెళ్ళడానికి అనుమతి లభించింది.
అర్హులైన వారికి హెచ్‌4, ఎల్‌-2 వీసాలను జారీ చేయనుంది.
ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతదేశంలో యూఎస్ ఎంబసీ,
కాన్సులేట్లు తెరిచేవరకు వెయిట్‌ చేయాల్సిందే. జూన్ 24 నాటికి చెల్లుబాటు అయ్యే
వీసా లేని హెచ్‌1 బీ, హెచ్ 4, జే1, హెచ్‌2ఏ వీసాదారులకు డిసెంబర్ 31,2020 వరకు
అనుమతులు ఉండవని మరోసారి స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక
సంక్షోభం కారణంగా ప్రొఫెషనల్ వీసాలను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ తాత్కాలికంగా
నిలిపివేసింది.
Flash...   Transfers latest Clarifications on 19.11.2020