India’s 2018 Tiger Census Makes It To Guinness Book Of World Records

మ‌న టైగ‌ర్లు ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కాయి… మ‌న పులులు.. గిన్నీస్ బుక్‌లో ఎక్క‌డ‌మేంటి? అవి ఏం చేశాయి? అనే అనుమానం వెంట‌నే రావొచ్చు… విష‌యం ఏంటంటే..

భార‌త్‌లో పుల‌ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.. 2018 లెక్కల్లో పుల‌ల
సంఖ్య  గిన్నీస్ రికార్డు నెల‌కొల్పింది. పుల‌కు సంబంధించిన ఫొటోల‌ను సైతం
సేక‌రించిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. 76,000 పులులు, 51వేల అడవి
పిల్లులు, చిరుతపులుల ఫోటోల‌ను తీసి రికార్డు నెల‌కొల్పారు.. ఫారెస్ట్ అధికారులు,
వన్యప్రాణి సంరక్షణ నిపుణులు.. దాదాపు 139 స్టడీ సైట్లలో 26,760 వేర్వేరు
ప్రదేశాలలో కెమెరాల‌ను అమ‌ర్చారు.. ఇక‌, ఈ ప్రాంతాల్లో తీసిన 35 మిలియన్ ఫోటోల‌ను
ప‌రిశీలించిన త‌ర్వాత‌.. పులుల సంఖ్యపై ఓ అంచ‌నాకు వ‌చ్చారు. 

ఈ ఫొటోల్లో ర‌క‌ర‌కాల వన్యప్రాణుల అరుదైన చిత్రాల‌తో పాటు.. 76,523 పులుల
చిత్రాలు, 51,337 చిరుతపులుల ఫోటోలను తీశారు.. భార‌త్‌లో ప్రస్తుతం దాదాపు 3000
పులులు ఉన్నాయ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు.. ఇక‌, 2014లో ఉన్న సంఖ్య ఎంటే
ఇది చాలా ఎక్కువ‌గా చెప్పాలి.. ఎందుకంటే.. 2014లో పులుల సంఖ్య‌ 2,226గా ఉండ‌గా..
2018లో వాటి సంఖ్య 2,967కి చేరింది. ఇక‌, పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా
కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు.. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌
ఇండియా, జాతీయ పులుల సంరక్షణ సంస్థ.. సంయుక్తంగా పుల‌ల సంఖ్య‌పై నివేదిక‌లు
రూపొందించ‌గా.. ఆ లెక్క‌ల ప్ర‌కారం 2006లో భార‌త్‌లో 1,411 పులులు మాత్రమే ఉండగా,
2014లో 2,226కు పెరిగాయి.. ఇక‌, 2018కి 2,967 చేరాయంటే.. భార‌త్‌లో పుల‌ల సంఖ్య
ఎలా పెరుగుతుందో ఇట్టే చెప్పేయొచ్చు
Flash...   Content Creation using DIKSHA tools - 3 day Online training to all teachers through AP DIKSHA YouTube Channel Schedule, Instructions