విద్యార్ధులకి కిట్లు పంపిణి చేయుటలో CMO / MEO లకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్య కమిషనర్ . RC SS-16021/8/2020 Dt: 16.07.2020.
ప్రతి జిల్లాకు రాష్ట్ర కార్యాలయం నుండి ఒక అధికారిని నియమించడం జరుగుతుంది నోటు: ఆరవ తరగతి నుండి నాలుగు రకాల నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కో విద్యార్థి ఒక్కో సెట్ గా తరగతులవారీగా నోటు పుస్తకాలు ఇవ్వాలి. సెట్ల వారీగా చేయాల్సిన బాధ్యత సప్లయిరుదే. సెట్లుగా చేసిన తర్వాతే వాటిని లాగిన్లో నమోదు చేయాలి.
లాగిన్ లో నమోదు:
జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణి వివరాల నమోదు మొత్తం schooledu.ap.gov.in లో గల స్టూడెంట్ సర్వీసెస్’ విభాగంలో ఇచ్చిన లాగిన్ల సహాయంతో పొందుపరచగలరు వివరాలు https://cse.ap.gov.in/DSENEW, https://ssa.ap.gov.in/SSA/ వెబ్ సైట్ల నందు కూడా పొందుపరచవచ్చు. దీనికి సంబంధించిన కరదీపికను, లాగిన్ల వివరాలు 16 వ తేదీన పొందుపరుస్తారు