MEO ల బదిలీలకు అంగీకారం

ఉపాధ్యాయుల బదిలీలతో పాటే మండల విద్యాశాఖాధికారుల బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంగీకరించారు.   రాష్ట్ర ఎంఈవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో శుక్రవారం అడిషన్ డైరెక్టర్ పి.పార్వతిగారిని, జాయింట్ డైరెక్టర్ దేవానంద్ రెడ్డిగారిని, ఆర్జేడీ రవీంద్రనాథ్ రెడ్డిగార్లను కలిసి బదిలీ లపై ఉన్న సాంకేతిక అంశాలను, అపోహలను చర్చించారు.  ఈ మేరకు ఎంఈవోల బదిలీలకు ఉద్దేశించిన సంబంధిత దస్త్రాన్ని సిద్ధం చేయాలని అడిషనల్ డైరెక్టర్, జేడీలు ఆదేశించా రన్నారు. ఎంఈవోలకు సెల్ఫ్ డ్రాయింగ్ విషయాన్ని పంచాయతీ రాజ్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
 రాష్ట్ర ఎంఈవోల సంఘం
Flash...   Telugu Stories for Students - Mobile apps of Telugu stories