RTC సంచలన నిర్ణయం..త్వరలో డ్రైవింగ్ స్కూల్స్..!

కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని సంస్థలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ
నేపథ్యంలోనే పరిమిత సంఖ్యలో బస్సులు నడిపి, నడిచిన బస్సుల్లో ప్రయాణీకులు తక్కువ
సంఖ్యలో ఎక్కి ఆర్టీసీ సైతం నష్టాలను మూటగట్టుకుంది. కాగా ఆ నష్టాలనుండి
గట్టెక్కడానికి టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ఆదాయాన్ని
పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు
కసరత్తు చేస్తోంది. ఈ డ్రైవింగ్ స్కూళ్లలో కార్ల నుండి భారీ వాహనాల వరకు శిక్షణ
ఇవ్వడానికి సిద్ధమౌతోంది. శిక్షణ కాలం మొత్తం 40 రోజులు ఉండేవిధంగా ప్రణాళిక
తయారు చేస్తుంది. వీటిలో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్స్
ఉండేలా అధికారులు ప్రణాళిక ను  రూపొందిస్తున్నారు. అయితే శిక్షణకు
సంబందించిన ఫీజును మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఇక ఇదివరకే ఆర్టీసీ నష్టాలను
తగ్గించేందుకు కార్గో సేవలను ప్రారంభించింది. 
Flash...   కోవిడ్‌ వైద్యంపై నిపుణుల బృందం..రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం