SBI సరికొత్త పని విధానం..ఇంటి వద్దకే మనీ ప్రారంభం.

SBI సరికొత్త పని విధానం, రూ.1,000 కోట్ల వరకు ఆదా! ఇంటి వద్దకే మనీ
ప్రారంభం..

కరోనా నేపథ్యంలో ఐటీ కంపెనీల నుండి బ్యాంకుల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. ఈ
వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, అలాగే ఉద్యోగులను, కస్టమర్లను కాపాడుకునేందుకు
సంస్థలుభిన్నంగా ముందుకు సాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ
ఉద్యోగులు ఎక్కడి నుండైనా పని చేసే వ్యవస్థను తీసుకు వస్తోంది. కస్టమర్ల కోసం
కాంటాక్ట్‌లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించనుంది.

ఎస్బీఐ కొత్త పని విధానం.. రూ.1,000 కోట్లు ఆదా 
ఉద్యోగులు ఏ ప్రాంతం నుండి అయినా పని చేసే విధానాన్ని అమలు చేయబోతున్నామని, వారి
ఉద్యోగ, సాంఘిక జీవనాన్ని సమతూకం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ
చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ఈ చర్యల వల్ల సంస్థకు కూడా కనీసం రూ.1000 కోట్లు
మిగులుతాయని చెప్పారు. అలాగే, కరోనా సమయంలో వ్యాపారానికి కూడా అవాంతరాలు లేకుండా
ఉంటుందన్నారు.
ఏటీఎం కార్డు లేకుండా నగదు చెల్లింపు 
ఏటీఎం కార్డు లేకుండా నగదు చెల్లింపులు, ఇంటి వద్దకు నగదు పంపిణీ, చెక్కులు
సేకరించడం వంటి కార్యక్రమాలను ప్రారంభించినట్లు రజనీష్ కుమార్ తెలిపారు. బ్యాంకు
అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎస్బీఐకి 44 కోట్లకు
పైగా కస్టమర్లు ఉన్నారు. వైవిద్యమైన రుణ పోర్ట్‌పోలియో, డిజిటల్ లీడర్‌షిప్ వంటి
ఎన్నో అంశాలు బ్యాంకుకు ప్రధాన బలం అన్నారు. ఎస్బీఐలో 2 లక్షల మంది ఉద్యోగులు
ఉన్నారు.
Flash...   జగన్ : ఏపీలో కొత్త జిల్లాలు.. ఆలోపు పూర్తి చేయాలని ప్లాన్..