TTD కీలక నిర్ణయం: కోవిడ్ కేర్ సెంటర్ గా విష్ణునివాసం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు  పెరిగిపోతున్నాయి. ఈరోజు ఏకంగా
ఏపీలో 2432 కేసులు నమోదయ్యాయి.  చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా
కేసులు పెరిగిపోతున్నాయి.  జిల్లాలో ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో
కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.   వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి
పెద్ద సంఖ్యలో నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి.  దీంతో అక్కడ కేసులు
పెరుగుతున్నాయి.  టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్స్ ఆసుపత్రిని కోవిడ్
ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు చికిత్స అందించాలని టీటీడీ నిర్ణయం
తీసుకుంది.  

అదేవిధంగా, తిరుపతిలో భక్తుల   ఆశ్రయం పొందేందుకు ఏర్పాటు చేసిన విష్ణు
నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 234 కేసులు నమోదుకాగా, అందులో 135 కరోనా
కేసులు తిరుపతిలోనే ఉండటం విశేషం.
Flash...   Zika Virus in Kerala: కేరళలో కలకలం.. తొలిసారి జికా వైరస్ కేసు నమోదు