Whats app లో మరిన్ని అదిరిపోయే ఫీచర్స్

అతి త్వరలోనే వాట్సాప్ లో మనకి మరి కొన్ని సరి కొత్త ఫీచర్లు రాబోతున్నాయి.ఇందులో
కొత్తగా కెమెరా షార్ట్ కట్, యానిమేటెడ్ స్టిక్కర్లను కంపెనీ కొత్తగా
ఇవ్వబోతున్నారు.
మరోవైపు వాట్సాప్ లో పేమెంట్ సర్వీస్ మొదలైన కేవలం పది రోజులు గడవక ముందే
అప్పట్లో బ్రెజిల్ దేశం ఆ సేవలను పూర్తిగా నిషేధించింది.ఆ విషయం అలా ఉండగా…
వాట్సాప్ సంస్థ ఈ వారంలో యానిమేటెడ్ స్టిక్కర్లను కొత్తగా యూజర్స్ కి
ఇవ్వబోతోంది.
ios, ఆండ్రాయిడ్ ఆధారిత వాట్సాప్ లకు యానిమేటెడ్ స్టిక్కర్లను జోడించాలని నిర్ణయం
తీసుకుంది.
ఇకపోతే కొత్తగా వచ్చే ఈ యానిమేటెడ్ స్టిక్కర్స్ లో మూడు విభాగాలుగా ఉంటాయని అర్థం
అవుతోంది.
ఇందులో మొదటగా యానిమేటెడ్ స్టిక్కర్లను చూసే అవకాశం, అలాగే ఎక్స్టెన్షన్ ద్వారా
అందుకున్న యానిమేటెడ్ స్టిక్కర్లను మన మొబైల్లో సేవ్ చేసుకొని వేరే వారికి
పంపడం.ఇక అలాగే రెండవది థర్డ్ పార్టీల నుండి యానిమేటెడ్ స్టిక్కర్లను డౌన్లోడ్
చేసుకునే అవకాశం కల్పించారు.
ఇదే మాదిరి మూడవది వాట్సప్ స్టోర్ నుండి డీఫాల్ట్ గా యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్
ను డౌన్లోడ్ చేసుకుని వేరే వారికి పంపించవచ్చు.అయితే ఈ సదుపాయాలు ప్రస్తుతానికి
మాత్రం కేవలం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది.
ఆ తర్వాతే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ యాజమాన్యం.
ఈ నెల మొదట్లో వాట్సాప్ బీటా వెర్షన్ లో చాట్ విండో లో మెసెంజర్ రూమ్స్ షార్ట్
కట్ ను ప్రవేశపెట్టిన సంగతి విధితమే.అయితే దీనివల్ల మెనూ లో ఉన్న కెమెరా షార్ట్
కట్ ను సంస్థ తొలగించింది.ఇకపోతే తాజాగా మళ్లీ చాట్ విండోలో కెమెరా షార్ట్ కట్
ప్రవేశపెట్టారు.
ఈ ఫీచర్ కేవలం తాజా వాట్సాప్ బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది.
Flash...   కరోనా 2.0 పంజా!