WhatsApp Banking: బ్యాంకింగ్ సేవలు మీ వాట్సప్‌లో పొందొచ్చు ఇలా

కస్టమర్లకు కావాల్సిన బ్యాంకింగ్ సమాచారాన్ని వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా
కస్టమర్లకు రియల్ టైమ్‌లో అందిస్తాయి బ్యాంకులు. వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవల్ని
పొందేందుకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి వాట్సప్‌లో
ఏఏ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చో, ఈ సర్వీస్‌కు ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి

వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా లభించే సేవలు ఇవే…
  1. అకౌంట్ బ్యాలెన్స్
  2. చివరి మూడు లావాదేవీల వివరాలు
  3. క్రెడిట్ కార్డుల ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్క్రెడిట్ కార్డ్ లిమిట్
  4. డెబిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ బ్లాక్ చేయడం లేదా అన్‌బ్లాక్ చేయడం
  5. ప్రీ-అప్రూవ్డ్ లోన్ల వివరాలు తెలుసుకోవడం
  6. ఇన్‌స్టా సేవ్ సేవింగ్స్ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయడం.
వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందండి ఇలా…
మీరు కూడా వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకుంటే ముందుగా మీ బ్యాంకుకు
సంబంధించిన వాట్సప్ నెంబర్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి. ఆ వాట్సప్
నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ
తర్వాత మీ ఫోన్‌కు టెక్స్ట్‌ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ వాట్సప్ నుంచి బ్యాంకు
నెంబర్‌కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ బ్యాంకింగ్
నియమనిబంధనల్ని అంగీకరించాలి. ఇక అప్పట్నుంచి మీరు వాట్సప్‌లోనే బ్యాంకింగ్ సేవలు
పొందొచ్చు. వాట్సప్‌లో ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉంది కాబట్టి మీ మెసేజ్‌లు
సురక్షితమే. అయితే వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించేటట్టైతే మీ వాట్సప్‌
యాప్‌కు పాస్‌వర్డ్ లేదా పిన్ ఉపయోగించడం మంచిది.
Flash...   Free Training for unemployed : నిరుద్యోగ యువతకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ .. ఎక్కడంటే..