WhatsApp: అలర్ట్… ఈ తప్పు చేస్తే మీ వాట్సప్ బ్లాక్ కావడం ఖాయం

మీరు మీ వాట్సప్‌ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి
వాడుతున్నారా? అయితే ఓకే. అలా కాదని ఆన్‌లైన్‌లో దొరికే వాట్సప్ మాడిఫైడ్ వర్షన్
వాడుతున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. మాడిఫైడ్ వాట్సప్ యాప్ వాడితే
మ్యాన్ ఇన్ ది మిడిల్-MITM ఎటాక్స్ జరగొచ్చు. అంతేకాదు… ప్రైవసీ సమస్యలు
రావొచ్చు. అంతేకాదు… మీరు మాడిఫైడ్ లేదా మాడెడ్ వాట్సప్ వాడుతున్నట్టు తెలిస్తే
మీ వాట్సప్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. వాట్సప్‌కు సంబంధించిన
అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు యూజర్లకు ముందే తెలిపే WABetaInfo కూడా మాడిఫైడ్ వర్షన్
వాడొద్దని హెచ్చరిస్తోంది. మాడెడ్ యాప్ అంటే డెవలపర్లు ఒరిజినల్ యాప్‌కు కొన్ని
మార్పులు చేసి రిలీజ్ చేస్తారు. ఇవి ఆన్‌లైన్‌లో లభిస్తాయి. కంపెనీ రిలీజ్ చేసే
యాప్ కాకుండా ఇలా మాడిఫైడ్ లేదా మాడెడ్ యాప్స్ వాడితే యూజర్లు రిస్కులో పడ్డట్టే.

💣 EXCLUSIVE NEWS FROM @WABetaInfo:
Spotted the WhatsApp for iPad official app, under development! 🔥https://t.co/3wBlLiWEKq

Open the article for screenshots.
NOTE: WhatsApp for iPad is not available yet and the support will be enabled in future for everyone in a new update.

— WABetaInfo (@WABetaInfo) April 8, 2019

వాట్సప్ మాడెడ్ యాప్ వాడుతున్నట్టైతే మీరు పంపే ప్రతీ మెసేజ్, ఫోటోలు, వీడియోలు
సైబర్ నేరగాళ్లు తెలుసుకోవడం చాలా సులువు. అదే వాట్సప్ ఒరిజినల్ యాప్ వాడితే ఎండ్
టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ప్రమాదం లేదు. ఎవరైనా వాట్సప్ యూజర్లు
మాడెడ్ యాప్ వాడుతున్నట్టైతే రిస్క్ గుర్తించాలని, యాప్ స్టోర్ నుంచి ఒరిజినల్
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని WABetaInfo కోరుతోంది.
Flash...   SSC EXAMS NR SUBMISSIONS - LOGIN PROBLEMS HELP LINES NUMBERS