అమితాబ్ బచ్చన్‌కి కరోనా.. ఆయన ఫ్యామిలీ కూడా

బాలీవుడ్ సూపర్ హీరో అమితాబ్ బచ్చన్‌కి కరోనా పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆయన ప్రజెంట్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఆస్పత్రికి వెళ్లామని కూడా ట్వీట్ చేశారు. ఈ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఇప్పటికే తనకి కరోనా అని తేలటంతో తన కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్ట్స్
చేయించుకున్నారని.. రిజల్ట్ త్వరగానే వస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే
తనని 10 రోజులుగా ఎవరెవరు కలిశారో వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన
సూచిస్తున్నారు. ప్రస్తుతం 77 సంవత్సరాల వయసున్న అమితాబ్ కరోనా బారిన పడడంతో
సన్నిహితులతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇది కాగా.. బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో కరోనా వారిని వచ్చినవారిలో సింగర్ కనికా
కపూర్ ఉండగా, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా చేరారు.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో
ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు
చూద్దాం..
* సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.
* ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
* శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్
వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
Flash...   కేరళకు ఎట్లా సాధ్యమైంది?
* వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా
శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
* మలం ద్వారా తక్కువనే చెప్పాలి.
కరొనా వైరస్ సోకిందని అనుమానంగా ఉంటే ముందుగా వైద్యుల దగ్గరికి వెళ్లాలి..
వారిచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు.
* ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
* నీరు ఎక్కువగా తాగుతుండాలి.
వైరస్‌ని నివారించవచ్చా..
మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌కి ప్రయత్నాలు ఇంకా
కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా
ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అందుకోసం ఇలా చేయండి.
* ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.
* చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..
* అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.