ఏపీలో కరోనా పంజా: మళ్లీ రికార్డ్ స్థాయిలో కేసులు

ఏపీలో కరోనా పంజా: మళ్లీ రికార్డ్ స్థాయిలో కేసులు.. మరో 13మంది మృతి
ఏపీలో కరోనా పంజా విసురుతూనే ఉంది. నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య భారీగా
పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది.. కేసులు బయటపడుతూనే ఉన్నాయి.. తాజా
బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 16,882 మందికి
పరీక్షలు నిర్వహించగా 1500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి
వచ్చిన వారికి 53 మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకింది..
దీంతో మొత్తం కేసులు 1555కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల
సంఖ్య 23814కు చేరింది. గడచిన 24 గంటల్లో 13మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల
సంఖ్య 277కి చేరింది. గత 24 గంటల్లో 904మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 12154 నమోదయ్యింది. మరో 11383మంది
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
గత 24 గంటల్లో అత్యధికంగా 
చిత్తూరు జిల్లాలో 236, 
గుంటూరు జిల్లాలో 228, 
విశాఖపట్నం జిల్లాలో 208, 
శ్రీకాకుళం జిల్లాలో 206, 
కృష్ణా జిల్లాలో 127, క
డప జిల్లాలో 114, 
ప్రకాశం జిల్లాలో 96, 
అనంతపురం జిల్లాలో 91,
 కర్నూలు జిల్లాలో 73, 
తూర్పుగోదావరి జిల్లా 47, 
నెల్లూరు జిల్లాలో 31, 
విజయనగరం జిల్లాలో 26, 
పశ్చిమగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. 
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2795 పాజిటివ్ కేసులు.. తర్వాత
అనంతపురం జిల్లాలో కేసులు 2659కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2663 కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు
కర్నూలు జిల్లా -2,795
గుంటూరు జిల్లా – 2,663
అనంతపురం జిల్లా -2,659
కృష్ణా జిల్లా – 2,095
తూర్పుగోదావరి జిల్లా – 2,062
చిత్తూరు జిల్లా- 2001
కడప జిల్లా – 1,554
పశ్చిమగోదావరి జిల్లా – 1,383
విశాఖపట్నం జిల్లా – 1191
నెల్లూరు జిల్లా -904
ప్రకాశం జిల్లా – 865
శ్రీకాకుళం జిల్లా – 566
విజయనగరం జిల్లా -333
Flash...   Life style: తడి దుస్తులను ఇంట్లో ఆరబెడితే.. ఆరోగ్యం పై ఈ ప్రభావం తప్పదు ...