అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది. మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం
ఉత్వర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో
మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సర్కార్ ఆదేశించింది.
