మీ పిల్లల పేరు మీద money savings చేయాలని ఉందా…అయితే Best Schemes మీ కోసం.

ఆడపిల్ల పుడితే ఉన్నత చదువులతో పాటు పెళ్లి ఖర్చు కోసం చింత ఉంటే. మగపిల్లాడు పుడితే మంచి ఉన్నత విద్య అలాగే అమెరికా పంపాలని చింత తల్లిదండ్రులకు ఉండటం సహజమే.. వీటి గురించే తల్లిదండ్రులు కష్టపడి సంపాదించడంతో పాటు నిత్యం ఆలోచిస్తుంటారు. అయితే పిల్లల పేరు మీద ఉన్న పాలసీల గురించి తెలుసుకుందాం.
పిల్లల భవిష్యత్తు గురించి ప్రతీ ఒక్కరికి చింత ఉంటుంది…అయితే వారి పేరు మీద ఏదైనా భూమి కొనాలని, లేదా షేర్లు కొనాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్ల పుడితే ఉన్నత చదువులతో పాటు పెళ్లి ఖర్చు కోసం చింత ఉంటే. మగపిల్లాడు పుడితే మంచి ఉన్నత విద్య అలాగే అమెరికా పంపాలని చింత తల్లిదండ్రులకు ఉండటం సహజమే.. వీటి గురించే తల్లిదండ్రులు కష్టపడి సంపాదించడంతో పాటు నిత్యం ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చదువులు, పెళ్లిల్లు బాగా ఖర్చుతో కూడినవిగా మారాయి. అయితే పిల్లల పేరు మీద ఉన్న పాలసీల గురించి తెలుసుకుందాం. ముందుగా ప్ర‌తి నెలా కొంత‌ పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారు బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ తెరవచ్చు. పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్లలో నెలకు 1000 రూపాయలు పొదుపు చేస్తే 5 ఏళ్లలో 75 వేల రూపాయల దాకా సంపాదించవచ్చు.
ఇక పిల్లల పేర్ల మీద పాలసీలు కూడా కట్టవచ్చు. అప్పుడే పుట్టిన పసిపిల్లల పేర్ల మీద కూడా పాలసీలను తీసుకునే అవకాశం ఉంది. పిల్లలకు 12 నుంచి 13 ఏళ్లు వచ్చే వరకూ ఈ పాలసీలను కొనసాగించవచ్చు. ఇక ఎల్ఐసీ లాంటి బీమా కంపెనీలు పిల్లల చదువు, పెళ్లి పేరిట బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. దాదాపు అన్ని బీమా కంపెనీలూ పిల్లలకు ప్రత్యేకమైన బీమా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి మనీ బ్యాక్ పాలసీ కాగా, మరొకటి మొత్తం సొమ్ము చేతికి వచ్చే ఎండోమెంట్ పాలసీ. సాధారణంగా పిల్లల మనీ బ్యాక్ పాలసీలు వారికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పాలసీ కాలపరిమితి పూర్తి అయ్యేవరకు ఏటా కొంత మొత్తం చొప్పున అందిస్తుంటాయి. ఇక ఎండోమెంట్ పాలసీల విషయానికి వస్తే పిల్లల చదువు లేదా పెళ్లికి అందుబాటులో వచ్చే విధంగా ఉంటాయి. తర్వాతి వీడియోల్లో ప్రత్యేకంగా పిల్లల ఎల్ఐసీ పాలసీ గురించి తెలుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ కూడా వివిధ రకాల చిన్న పిల్లల పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి ఈక్విటీ డైవర్సిఫైడ్, బ్యాలెన్స్‌డ్, డెట్ ఫండ్స్ రూపంలో లభిస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌లో అత్యధిక శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అధిక రిస్క్‌ను, అధిక రాబడిని కలిగి ఉంటాయి. ఇక బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ విషయానికి వస్తే సగం ఈక్విటీ, మిగిలిన సగం డెట్, మనీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో రిస్క్ సగానికిపైగా తగ్గుతుంది. అదే డెట్ ఫండ్స్ అయితే రిస్క్ తక్కువ, రాబడి వడ్డీరేట్లు, మనీ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటుంది. పైన చెప్పుకున్నట్లు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొద్దిగా రిస్క్‌తో ఉంటుందనే విషయం మర్చిపోవద్దు.
కేవ‌లం అమ్మాయిల కోసం పొదుపు చేయాల‌నుకుంటే సుక‌న్య స‌మృద్ది ప‌థ‌కం బాగా ఉంటుంది. ఈ ప‌థ‌కంలో ఖాతా తెరిచేందుకు అమ్మాయిల వ‌య‌సు 10 ఏళ్ల లోపు ఉండాలి. ఒక సంవత్స‌ర కాలంలో క‌నీస డిపాజిట్ రూ. 1000 నుంచి గ‌రిష్టంగా రూ.1.50 ల‌క్ష వ‌ర‌కూ చేయ‌వ‌చ్చు.ఖాతా తెరిచిన‌ప్ప‌టి నుంచి 14 సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగించే వీలుంటుంది. మీ ద‌గ్గ‌ర్లో ఉన్న బ్యాంకులో, పోస్టాఫీసులో ఈ ఖాతా తెరిచే సదుపాయం ఉంటుంది. సుక‌న్య స‌మృద్ది యోజ‌న కింద జ‌మ చేయ‌బ‌డిన మొత్తానికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి
Flash...   అమ్మకానికి అందమైన ఐలాండ్ - ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!