విద్యా సంవత్సరం ఉంటుందా?ఉండదా? – పవన్

విద్యావ్యవస్థపై చర్చించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన ఇచ్చిన
ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు.
ప్రశ్న: కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విద్య.
వైద్య రంగాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఆన్ లైన్ తరగతులు కొన్ని ప్రయివేటు
పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు ఏ కార్యక్రమం
ప్రారంభం కాలేదు. మరి వారి పరిస్థితి ఏంటి? దీని మీద మీ అభిప్రాయం
ఏంటి?

– నా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నాకు స్వానుభవం ఉంది. దీనిలో రెండు రకాల
సమస్యలు ఉన్నాయి. ఆర్ధికంగా బలం ఉన్న స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు నడుపుతున్నాయి.
దాని నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు వేరు. అది ఒక ఇష్యూ. ప్రభుత్వ పాఠశాలల విషయానికి
వస్తే ఆన్ లైన్ క్లాసులు నడిపే వ్యవస్థ లేదు.
ఒక విద్యా సంవత్సరం పోతుంది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం,
విపత్కర కాలం, ఏం చేయలేం అనే కంటే ముందు ఈ విద్యా వ్యవస్థలో ఈ ఇబ్బందులు ఉన్నాయి
అని గుర్తించాలి. దీని మీద ఎవరూ చర్చించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక
ప్రణాళికే లేదనిపిస్తోంది. లాక్ డౌన్ సమయంలో విద్యా సంవత్సరం పరిస్థితి ఏమిటి, ఏం
చేయాలని ఆలోచన చేసి ఉండాల్సింది. విద్యార్ధులకు ఒక విద్యా సంవత్సరం పోతుందా? లేదా
అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆన్ లైన్ క్లాసులు నడిపే ప్రైవేటు స్కూళ్లలో కూడా
అంతసేపు పిల్లలు కంప్యూటర్లు చూడలేకపోతున్నారు. వారికి ప్రత్యేకంగా ఆరోగ్య
సమస్యలు వస్తున్నాయి. స్కూల్స్ తెరిచినపుడు ప్రయివేటు స్కూల్స్ కు బస్సులు అని,
మెయింటినెన్స్అ ని ఖర్చులు ఉండేవి, ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా అంతంత ఫీజులు ఎందుకు
తీసుకుంటున్నారన్న కంప్లైయింట్స్ వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా.
Flash...   నెలకి లక్ష పైగా జీతం తో టెన్త్, డిగ్రీ అర్హత తో 17710 ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి Employees State Insurance Corporation Jobs