షాకింగ్: ఏపీలో ఒక్క రోజే 10 వేలకు పైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో రికార్డు బద్దలుకొట్టే రీతిలో కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఏకంగా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే 24 గంటల్లో రికార్డు స్థాయిలో 65 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 70,584 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏకంగా 10,093 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,20,390కు చేరింది.
ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా 65 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,213కు చేరింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 14 మంది, అనంతపురంలో 8 మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
ఇక గడిచిన 24 గంటల్లో 2,784 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,20,390 పాజిటివ్ కేసులకు గాను 55,406 మంది డిశ్చార్జి కాగా.. 63,771 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక బుధవారం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాత అనంతపురం జిల్లాలో 1,371, చిత్తూరులో 819, గుంటూరులో 1,124, కడపలో 734, కృష్ణా జిల్లాలో 259, నెల్లూరులో 608, ప్రకాశంలో 242, శ్రీకాకుళంలో 496, విశాఖపట్నంలో 841, విజయనగరంలో 53, పశ్చిమ గోదావరిలో 779 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 17,739 కేసులు నమోదు కాగా, తర్వాత కర్నూలు జిల్లాలో 14,471, గుంటూరు జిల్లాలో 12,816, అనంతపురం జిల్లాలో 12,358, పశ్చిమ గోదావరి జిల్లాలో 10,356 కేసులు నమోదయ్యాయి.
Flash...   PM MODI : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర..?