ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తున్నారా అయితే జాగ్రత్త..!

ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవాళి
కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు. బ్యాంకుకి వెళ్లి గంటలు తరబడి లైన్ లో
నిల్చోవాల్సిన అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి
తీసుకొచ్చారు. అయితే మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్స్
ద్వారా డబ్బులు సులభంగానే ట్రాన్స్‌ఫర్ చేయవచ్చును. అయితే ఆన్‌లైన్‌లో డబ్బులు
పంపటేప్పుడు ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అవసరం అవుతుంది. ప్రతి బ్యాంక్‌కు, బ్రాంచ్‌కు ఒక్కో
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఉంటుందన్నా విషయం అందరికి తెలిసిందే.
అయితే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి ఆప్షన్ల ద్వారా డబ్బులు ఇతరులకు
పంపొచ్చు. డబ్బులు ఎవరికైతే పంపాలో వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు ముందుగానే
రిజిస్టర్ చేసుకోవాలని నిపుణులు తేలిపారు. ఇలా రిజిస్టర్ చేసేటప్పుడు ఐఎఫ్ఎస్‌సీ
కోడ్ అవసరం అవుతుందని తెలిపారు. మీరు బెనిఫీషియరీ అకౌంట్ వివరాలు రిజిస్టర్
చేయకుండానే క్విక్ ట్రాన్స్‌ఫర్ రూపంలో డబ్బులు పంపొచ్చు అని నిపుణులు
తెలియజేశారు. ఇక్కడ కూడా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కావాలని
నెట్ బ్యాంకింగ్ లో ఐఎఫ్ఎస్‌సీ కోడ్ చాలా ముఖ్యమైనదన్నారు. దీని ద్వారా బ్యాంక్
బ్రాంచ్ తెలుసుకోవచ్చునని నిపుణులు వెల్లడించారు. అయితే ఈ కోడ్‌లో 11 డిజిట్స్
ఉంటాయి. తొలి 4 అక్షరాలు బ్యాంక్ పేరును సూచిస్తాయి. ఐదో లెటర్ జీరో. ఇక చివరి
ఆరు డిజిట్లు బ్రాంచ్ కోడ్. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా వేస్తే ఇబ్బందులు పడాల్సి
వస్తుందన్నారు.
ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేటప్పుడు ఒక బ్రాంచ్ బదులు వేరొక బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ
కోడ్ వేస్తే.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవ్వొచ్చు అని తెలిపారు. అయితే ఇక్కడ ఒక
బ్యాంక్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ బదులు వేరే బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వేస్తే..
ఆ బ్యాంక్‌లో కూడా అకౌంట్ నెంబర్ ఒకేలా ఉంటే అప్పుడు డబ్బులు మీరు పంపాల్సిన
అకౌంట్‌కు కాకుండా వేరొక అకౌంట్‌కు వెళ్లిపోతాయి. అందువల్ల డబ్బులు పంపేటప్పుడు
అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.
Flash...   AP: స్కూళ్లు, కాలేజీలకు కొత్త రూల్స్‌.. పరీక్షలు, ఫీజులు అన్నిటా కొత్త నిబంధనలు