ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్య సేవలు. Medical Reimbursement నిలిపివేత.

➪ మెడికల్ రీయింబర్స్ మెంట్  సౌకర్యం నిలిపివేత.

➪ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆదేశాలు.

➪ ఆరోగ్యశ్రీ  ట్రస్టు సీఈవో ఉత్తర్వులు.

✰ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య సేవలందించాలని ప్రభుత్వం
నిర్ణయించింది.

✰ ఈనెల 1 నుంచి మెడికల్ రీయింబర్స్ మెంట్ సౌకర్యాన్ని నిలిపివేసింది.

✰ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు నెట్ వర్క్ 
ఆసుపత్రులన్నీ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈ హెచ్ఎస్) కింద నాణ్యమైన వైద్య సేవలు
అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

✰ ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

✰ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచిపూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ కింద నగదు రహిత
వైద్యసేవలు అందించాలని కోరుతున్నారు.

✰ ఈ విషయమై కొన్ని నెట్ వర్క్ ఆసుపత్రులు అభ్యంతరం చెప్తుండటంతో నగదు రహిత
వైద్యసేవలుఅందుబాటులోకి రాలేదు.

✰ ఇటీవల ప్రభుత్వం ఈ హెచ్ ఎస్ నెలవారీ ప్రీమియంను కూడా ఒకటిన్నర రెట్లు పెంచింది.

✰ గతంలో రూ.90 చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం రూ. 225, రూ 120
చెల్లించే వారు రూ 300 నెలవారీ ప్రీమియం కడుతున్నారు.

✰ ఈ హెచ్ ఎస్ సేవలకు నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నగదు చెల్లించే విధంగా ప్రతినెలా
5లోపు ఖజానాశాఖ నుంచి ఆరోగ్యం ట్రస్టుకు నిధులు బదిలీ చేయాలని ప్రభుత్వం
ఆదేశించింది.

✰ ఈ నేపథ్యంలో ఉద్యోగులకు, పెననర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించే విషయంలో
ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది

ఉచిత సేవలు అందించకపోతే చర్యలు

✰ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఉచిత వైద్య సేవలు అందించని నెట్ వర్క్
ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్టు హెల్త్ కేర్ సీఈవో
హెచ్చరించారు.

✰ ఉద్యోగుల నుంచి వైద్య సేవలకు డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రులకు వారు తీసుకున్న
మొత్తానికి  10 రెట్లు జరిమానా విధిస్తామని సీఈవో తన ఉత్తర్వుల్లో స్పష్టం
చేశారు.

Flash...   BASELINE MODEL PAPERS FOR ALL CLASSES

✰ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పథకాలను మూడు నెలలపాటు ఆయా
ఆసుపత్రులకు వర్తించకుండా సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించారు.