ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా


గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా టెస్టుల్లోపాజిటివ్‌గా అని
నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు. జ్వ‌రంతో
ఇబ్బంది ప‌డుతున్న త‌ను క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని డాక్ట‌ర్స్
చెప్పిన‌ట్లు ఆయ‌న ఆ వీడియోలో తెలిపారు. ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు
హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. త‌న ఆరోగ్యం ఎవ‌రూ
భ‌య‌ప‌డ‌న‌క్క‌ర్లేద‌ని ఆయ‌న స‌ద‌రు వీడియో ద్వారా తెలియ‌జేశారు. తనకు ఎవరూ
పోన్లు చేయవద్దని, డాక్టర్స్ రెస్ట్ అవసరమని సూచించినట్లు ఎస్పీబీ
తెలిపారు. 

Flash...   SBI చెప్పింది GOOD NEWS.. రేపటి నుంచే అమల్లోకి.