ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఆవిష్కరణ!
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధారణ కీలకమైంది. అసలు కరోనాను
ఎలా ఎదుర్కోవాలి? మందులు ఎప్పుడొస్తాయి? వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతం
అవుతున్నాయా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్త ఉపశమనం కలిగిస్తే
బాగుంటుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు స్నేహితులైన ఆ ముగ్గురు మహిళా ఇంజినీర్లు.

కొవిడ్‌ను అంతమొందించేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. వ్యాక్సిన్లు
తయారుచేసేవాళ్లు వ్యాక్సిన్లు.. ఔషధాలు కనిపెట్టేవాళ్లు ఔషధాలు! అదే సమయంలో,
టెక్నాలజీ కూడా కొవిడ్‌పై సమరం చేస్తున్నది. ఉన్న టెక్నాలజీనే కొవిడ్‌కు
అన్వయించే ప్రక్రియా జరుగుతున్నది. అలాంటి ఓ ప్రయత్నమే.. రియోట్! ఇదో ఆధునిక
బేబీ మానిటర్. పూర్తిపేరు రేబేబీ మానిటర్. చిన్నారులకు కాస్త దూరంలో ఉంచితే
చాలు – ఒంటిని తాకకుండా.. పిల్లల శరీర ఉష్ణోగ్రతనీ, నిద్రనూ, ఇతర అంశాలనూ
గమనిస్తూ ఉంటుంది. రియోట్‌నే.. కొవిడ్ చికిత్సలో వాడుకోవచ్చని చెబుతున్నారు దాని
ఆవిష్కర్తలు ఆర్ధ్రా కన్నన్ (కృత్రిమమేధ నిపుణురాలు) రంజనా నాయర్ (కంప్యూటర్
ఇంజినీర్), సాంచి పూవయా (మెకానికల్ ఇంజినీర్).. ముగ్గురూ బెంగళూరువాసులే.
శ్వాస ద్వారా కూడా కొవిడ్ రోగుల ఆరోగ్య స్థితిని బేరీజు వేయవచ్చనే సమాచారం.. ఈ
యువ ఆవిష్కర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మిగతా పరికరాలతో పోలిస్తే..
రియోట్ కచ్చితంగా శ్వాసను లెక్కగడుతుంది. ఇందుకు.. సెన్సర్ టెక్నాలజీనీ, రేడియో
తరంగాల్నీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నూ ఉపయోగించుకుంటుంది. ఈ పరికరాన్ని
ప్రయోగాత్మకంగా బెంగళూరులోని ఓ వైద్యశాలలో వాడి చూశారు. నిజానికి శరీరానికి ఏ
సమస్య వచ్చినా.. ఆ ప్రభావం శ్వాసమీద కనిపిస్తుంది. కాబట్టే, తమ పరికరం వైద్య
ప్రపంచానికి చాలా ఉపయోగకరమని చెబుతున్నారు ఆ మిత్ర త్రయం!