శిరో ముండన కేసులో A1 గా నూతన నాయుడు భార్య

నూతన్ నాయుడు భార్యతో పాటు సెలూన్ బార్బర్… బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు
పై కేసు నమోదు.


విశాఖ శివారు పెందుర్తి లో శిరో మండనం పాల్పడిన నూతన్ నాయుడు కుటుంబ సభ్యుల పై
పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి ఈ దారుణానికి
ప్రధాన పాత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. సుజాతనగర్ లో నూతన్ నాయుడు
ఇంటికి సమీపాన ఆర్ఎస్ హెయిర్ సెలూన్ లో బార్బర్ ను బెదిరించి నూతన్ నాయుడు ఇంటిలో
ఆదిత్యుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ
వ్యవహారంలో నూతన్ నాయుడు సూపర్వైజర్ తో పాటు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు కూడా
కీలక పాత్ర పోషించిన టు గుర్తించడంతో మొత్తం ఏడుగురు వ్యక్తులను పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగినప్పుడు ఇంట్లో నూతన్ నాయుడు లేనట్టు
బాధితుడు చెప్పాడు .అయితే నూతన నాయుడు ఆదేశాలు లేకుండా అతని భార్య మాధురి ఇంత
దారుణానికి ఒడిగట్టే అవకాశాలు ఉండవని దళిత సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన్
నాయుడు కుటుంబ సభ్యులను బెదిరించడం వల్లే సెలూన్ నిర్వాహకుడు శిరో మండనానికి
పాల్పడినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు.

Flash...   Lear a Word a Day November 2023 Words list : లెర్న్ ఏ వర్డ్ ఏ డే నవంబర్ 2023 పదాలు విడుదల