హోమ్ లోన్ తీసుకున్నారా? ఇలా చేస్తే మీకు 3 రూ.లక్షలు ఆదా!

సొంతింటి కల సాకారం చేసుకోవడానికి లోన్ తీసుకున్నారా? హోమ్ లోన్ తీసుకుంటే ప్రతి
నెలా ఈఎంఐ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి మీకో ఆప్షన్
అందుబాటులో ఉంది. ప్రస్తుతం పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో లింక్డ్ హోమ్ లోన్స్
అందిస్తున్నాయి.
ఇందులో భాగంగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. రెపో
రేటు తగ్గితే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గుతుంది. అదే పెరిగితే పెరుగుతుంది.
ఎంసీఎల్ఆర్‌తో ఇక్కడ పని లేదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు
ప్రాతిపదికన బ్యాంకులకు రుణాలు అందిస్తుంది.
రెపో రేటు రుణాలు తీసుకుంటే ఆర్‌బీఐ రేట్లు తగ్గించిన వెంటనే ఆ ప్రయోజనం
కస్టమరన్లకు అందుతుంది. అదే ఎంసీఎల్ఆర్ రుణాలు తీసుకుంటే రేట్ల తగ్గింపు నిర్ణయం
కస్టమర్లకు చేరడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఎంసీఎల్ఆర్ రుణాలకు రీసెట్ డేట్
ఉంటుంది. అప్పుడే రేట్ల తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది.
అందుకే ఎంసీఎల్ఆర్ హోమ్ లోన్ తీసుకొని ఉంటే రెపో హోమ్ లోన్‌కు మారిపోవడం మంచిది.
ప్రస్తుతం రెపో లింక్డ హోమ్ లోన్స్ 7 శాతం లోపు వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. కానీ
ఎంసీఎల్ఆర్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు ఇంకా 7.5 శాతానికి పైనే ఉంది. అందుకే
వెంటనే మీ హోమ్ లోన్‌‌ను ఎంసీఎల్ఆర్ నుంచి రెపో రేటుకు మార్చుకోండి.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంసీఎల్ఆర్ హోమ్ లోన్ తీసుకున్నాడు. అతనికి ఇంకా రూ.25 లక్షల
బ్యాలెన్స్ ఉంది. ఇంకా 180 నెలలు ఈఎంఐ చెల్లించాలి. వడ్డీ రేటు 8.2 శాతం. ఇప్పుడు
ఇతని ఈఎంఐ రూ.24,180గా ఉంటుంది. వడ్డీ రూపంలో రూ.18.52 లక్షల చెల్లించాలి. అదే ఈ
రుణాన్ని రెపో రేటుకు (7.1 శాతం) బదిలీ చేసుకుంటే.. రూ.15.69 లక్షల వడ్డీ
చెల్లిస్తే సరిపోతుంది. అంటే రుణ గ్రహీతకు రూ.2.83 లక్షలు ఆదా అవుతాయి. ఈఎంఐ
రూ.22,610గా ఉంటుంది. ఈఎంఐ తగ్గించుకోకుండా ఉంటే అప్పుడు 161 నెలలు ఈఎంఐ కడితే
సరిపోతుంది. ఇప్పుడు మరో రూ.1.91 లక్షలు ఆదా అవుతాయి.
Flash...   Best Cars Under 7 Lakhs : రూ.7 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్స్ ఇవే..! సూపర్​ డిస్కౌంట్స్ కూడా !