10th Class Short memos in website

నేడు పది పాస్ – “షార్ట్ మెమో”ల విడుదల*

 👉 రేపటి నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు

 👉 త్వరలో ఇంటర్ ప్రవేశాలకు ఆన్ లైన్ అడ్మిషన్ల షెడ్యూల్

కొవిడ్ ఉధృతి కారణంగా ఈ ఏడాది పరీక్షలు రాయకుండానే ఆల్ పాస్  నిర్ణయంతో
ఉత్తీర్ణులై సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులందరికీ తీపి కబురు.
గ్రేడులు, మార్కులు లేకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అని పేర్కొంటూ మార్కుల
జాబితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు తొలుత గురువారం షార్ట్ మార్కుల
లిస్టులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ – ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెబ్
సైట్లో ఆన్లైన్ లో అప్లోడ్ చేయనున్నారు. వీటిని శుక్ర వారం నుంచి విద్యార్థులకు
వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తదుపరి పై చదువులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మార్కుల జాబితాల లాంగ్ మెమో లను త్వరలో విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిస్తారు.
విద్యార్థులు షార్ట్ మెమోలపై స్కూల్ హెచ్ఎంలతో సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది.
అన్ని సబ్జెక్టులకు ఎదురుగా మార్కుల జాబితా లో పాస్’ అని విడివిడిగా పేర్కొంటారు.
once failed  విద్యార్థులకు జారీచేసే మార్కుల జాబితాలో సంబంధిత దరఖాస్తు
చేసుకున్న సబ్జెక్టులకుఎదురుగా కంపార్ట్మెంటల్ పాస్  అని పేర్కొంటారు.

Flash...   NMMS 2022-23 HALLTICKETS RELEASED - Previous Question papers