40 కోట్లకు పైగా అకౌంట్లలో రూ.1.30 లక్షల కోట్ల డిపాజిట్లు

PMJDY మైలురాయి: 40 కోట్లకు పైగా అకౌంట్లలో రూ.1.30 లక్షల కోట్ల డిపాజిట్లు
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 40 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్ అయ్యాయి.
దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 2014
ఆగస్ట్ 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ PMJDY పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం
కింద ఇప్పటికి 40.05 కోట్ల ఖాతాలు పని చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం
తెలిపింది.
రూ.1.30 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు PMJDY ఖాతాల్లో రూ.1.30 లక్షల కోట్లకు
పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రాథమిక ఖాతాలు కాగా, రూపే డెబిట్ కార్డు, ఓవర్
డ్రాఫ్ట్ సదుపాయం కల్పించారు. ఖాతాదారులకు ప్రమాద బీమాను తొలుత రూ.1 లక్షగా
నిర్ణయించారు. ఆ తర్వాత 2018 ఆగస్ట్ 28న దీనిని రూ.2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని రూ.5,000 నుండి రూ.10,000కు పెంచారు.
PMJDY కింద ఉన్న ఖాతాల్లో సగానికి పైగా మహిళలవే కావడం గమనార్హం.
గరీబ్ కళ్యాణ్ యోజన జమ ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చొరవలో భాగంగా మరో మైలురాయి.
PMJDY పథకం కింద తెరిచిన ఖాతాలు మొత్తం 40 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి.’ అని
ఆర్థిక సేవల విభాగం పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదలకు సాయం చేసేందుకు
మూడు విడతల్లో రూ.1500 మొత్తాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద
ప్రభుత్వం జమ చేసింది. వీటిని PMJDY అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం. మార్చి 26,
2020న రూ.500 చొప్పున అకౌంట్లలో వేస్తామని చెప్పిన విషయం తెలిసింది. ఏప్రిల్
నుండి ఈ మొత్తాన్ని అకౌంట్లలో వేసింది.
జన్ ధన్ పేరు అలా వచ్చింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం పేరును పౌరుల నుండి
వచ్చిన సూచన ఆధారంగా తీసుకున్నారు. మైగవ్ నిర్వహించిన ఆన్‌లైన్ కాంటెస్ట్‌లో
పౌరుల నుండి వందలాది సలహాలు వచ్చాయి. ఇందులో జన్ ధన్‌ను ఎంపిక చేశారు. ఈ ఖాతా
తెరిచేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే ఆధార్ నెంబర్ లేకుంటే వారు
తొలుత రిజిస్ట్రేషన్ చేసుకొని, తర్వాత సమర్పించాలి. పదేళ్ల పైబడిన వారు ఈ ఖాతా
ఓపెన్ చేయవచ్చు. మైనర్లు నెలకు నాలుగుసార్లు డబ్బులు ఉపసంహరించుకునే రూపేకార్డుకు
అర్హులు.
Flash...   ఫ్లైట్ల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపేయండి.. ప్ర‌ధానికి ఢిల్లీ సీఎం లేఖ‌