AP గ్రామ సచివాలయాల్లో Dgital Payments

గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజిటల్ లావాదేవీల కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు ఆ రోజుల్లోఎపిలో ఎంత మేర డిజిటల్ లావాదేవీలు నిర్వహించారో కాని, ఎపి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క క్లిక్ లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,వార్డు సచివాయాలలో డిజిటల్ పేమెంట్ లకు శ్రీకారం చుట్టారు.గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. 

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.ఈ సందర్బంగా జగన్ గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ గురించి వివరించి, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశామని, డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను తీసుకువచ్చామని అన్నారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకును సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ హజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌.వి.ప్రభాకర్, ఎన్‌పీసీఐ ఎండీ,CEO దిలిప్‌ అస్బే పాల్గొన్నారు.

Flash...   Article of Charges framed against FAPTO General Secretory