Gas Booking పై cash back ఆఫర్ …

 మీరు గ్యాస్ సిలిండర్ ని ఉపయోగిస్తున్నారా? అయితే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను సులభంగా బుక్ చేసుకోవడానికి ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. అయితే గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుసుకోవచ్చునని తెలిపారు. లేదంటే ఆన్‌లైన్‌లో నేరుగానే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

అంతేకాకుండా ఈ రెండూ కాకపోతే గ్యాస్ పేటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చునన్నారు. ఇది కూడా కాకపోతే వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉందని తెలిపారు. ఇవి కాకుండా గ్యాస్ బుకింగ్ కి మరో ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈకామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చునని తెలిపారు.

అయితే అమెజాన్ ద్వారా కూడా ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను సులభంగా బుక్ చేసుకోవచ్చునన్నారు. అంతేకాకుండా అమెజాన్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం వల్ల క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశముందని తెలిపారు. అయితే తొలిసారిగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికే ఇది వర్తిస్తుందన్నారు. రూ.50 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఆగస్ట్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే ద్వారా బిల్లు చెల్లిస్తే రూ.50 తగ్గింపు పొందొచ్చునని తెలిపారు.

అంతేకాకుండా అమెజాన్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలన్నారు. తర్వాత అమెజాన్ పే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎల్‌పీజీ సిలిండర్‌పై క్లిక్ చేయాలని తెలిపారు. మీది ఏ గ్యాస్ ఏజెన్సీనో సెలెక్ట్ చేసుకోవాలన్నారు. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి బిల్లు మొత్తం చెల్లించాలన్నారు.అప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుందని తెలిపారు.
Flash...   HCQ హైడ్రాక్సీ‌క్లోరోక్విన్ వాడకంపై కేంద్రం GUIDELINES ఇవే