NEP 2020 అమలు మహాయజ్ఞం

భాగస్వాములంతా కలిసి రావాలి

 నవ భారతానికి ఇది పునాదిరాయి: మోదీ

న్యూఢిల్లీ: ఇటీవల కేబినెట్‌ ఆమోదించిన కొత్త విద్యావిధానం కేవలం సర్క్యులర్‌ కాదని, దాని అమలు మహాయజ్ఞం లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రభుత్వ దృఢ సంకల్పంతో పాటు భాగస్వాములందరి సమష్టి కృషి అవసరమని చెప్పారు. తమ విద్యావిధానం నవ భారతానికి పునాది రాయి అవుతుందన్నారు. ఎలా ఆలోచించాలి? అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెడుతుందని చెప్పారు. ఇప్పటిదాకా అనుసరించిన విద్యావిధానం ఏం ఆలోచించాలనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇందులోని సంస్కరణల అమలుపై దృష్టి సారించాలని విద్యా వ్యవస్థలోని భాగస్వాములకు పిలుపునిచ్చారు. కొత్త విద్యావిధానంపై ఆరోగ్యవంతమైన చర్చ జరగడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇంత పెద్ద ప్రణాళికను ఎలా అమలు చేస్తారని ప్రశ్నలు తలెత్తడం సహజమే. మనందరం కలిసి చేస్తాం. మీరంతా వ్యక్తిగతంగా ఈ విద్యావిధానం అమల్లో భాగస్వాములే’’ అని చెప్పారు. నూతన విద్యావిధానంపై యూజీసీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో శుక్రవారం ప్రధాని మాట్లాడారు.

‘‘ఇప్పుడు కావాల్సింది విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలు, సమాజం అవసరాలను ముం దు గుర్తించాలి. యువతలో విశ్లేషణాత్మక, వినూత్న ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించాలి. విద్యకు లక్ష్యం, దార్శనికత, తపన ఉంటేనే ఇది సాధ్యం’’ అని చెప్పారు. దేశంలోని నిపుణులు వలస పోకుండా చూడటం కూడా తమ విద్యావిధానం లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. ‘‘విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి ఇచ్చే విషయంలో రెండు రకాల ఆలోచనా ధోరణులున్నాయి. ఒకవర్గం విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అంటోంది. మరో వర్గం ప్రభుత్వం మాటే చెల్లాలని చెబుతోం ది. మధ్యేమార్గంగా వెళితేనే నాణ్యమైన విద్య లభిస్తుంది. నాణ్యమైన విద్య అందించే వాటికి మరింత స్వేచ్ఛనిస్తాం’’ అన్నారు.

Flash...   10వ తరగతి / ఇంటర్ పరీక్షలు పై మంత్రి గారి తాజా ప్రెస్ మీట్ (22.04.2021) వివరాలు