Service regularisation of Teachers in WG Dt. – Information

RC No: SPL/A3 Dated: 14-08-2020. West Godavari.

ఎవరి సర్వీస్ అయితే రెగ్యులరైజ్ చేయబడలేదో మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ జరగలేదో
అటువంటి ఉపాధ్యాయుల కొరకై ఈ నెల 17వ తేదీ నుంచి డీఈవో ప.గో వారి కార్యాలయము,
ఏలూరు నందు నిర్వహించబడు  “వారం రోజుల మేళా కార్యక్రమం”  నిమిత్తం
DyEOs, MEO లకు డీఈవో ప.గో వారు విడుదలచేసిన ప్రత్యేక సర్క్యులర్లో ముద్రించబడిన
మార్గదర్శకాల సారాంశం (తెలుగులో…) మీ కోసం

1)  సర్వీస్ రిజిస్టర్లతో పాటు దరఖాస్తును డీఈవో ప.గో వారి కార్యాలయానికి
పంపవలెను

2)  SGTs మరియు దానికి సమానమైన కేడర్ కలవారు ఎంఈఓ వారి ద్వారా పంపవలెను

3)  ఉన్నత పాఠశాలలు SAs మరియు దానికి సమానమైన కేడర్ కలవారు సంబంధిత డిప్యూటీ
ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ద్వారా పంపవలెను

4)  వ్యక్తిగతంగా పంపిన ప్రతిపాదనలు అంగీకరించబడవు

5)  MEOలు తమ మండలంలో పనిచేస్తున్న SGTs మరియు SAs ఎస్.‌ఆర్‌లను ఒక బంచ్‌లో
మెసెంజర్ ద్వారా సమర్పించాలి.

6)  చేరిన తేదీ, EOLs, క్రమశిక్షణా చర్యల పెండింగ్ విషయాలను పూర్తిగా
ధృవీకరించాలి.  ప్రతిపాదనలను సమర్పించునపుడు సంతకం చేసి మా నోటీసుకు
తీసుకురావాలి

7)  ఏదైనా తప్పుడు సమాచారం సమర్పించిన యెడల, వారే బాధ్యతగా ఉండును.

8)  ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్
ఉపాధ్యాయుల పూర్వచరిత్రకు లోబడి జరుగును.

9)  జతచేయబడిన మోడల్ ప్రొఫార్మాతో పాటుగా  ప్రతిపాదనల కవరింగ్ లెటర్
సాఫ్ట్ & హార్డ్ కాపీలు సమర్పించాలి.

————————

సర్వీసు రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు ప్రతిపాదనలు పంపువిషయమై
సూచనలు:

1. ప్రస్తుత క్యాడర్ నందు మాత్రమే రెగ్యులరైజేషన్ ప్రతిపాదనలు పంపాలి.

2. క్రింద క్యాడర్ లో రెగ్యులరైజేషన్ అయిన వారు/ కాని వారు ప్రస్తుత ప్రమోషన్
క్యాడర్ లో  రెగ్యులరైజేషన్ కొరకు ప్రతిపాదనలు పంపాలి.

3. రెగ్యులరైజేషన్ కండిషన్ గా చేయబడుచున్నందున Attestation forms ఇప్పుడు కాకుండా
తదుపరి 6 నెలల లోపు పంపవలసి ఉంటుంది.

Flash...   క్షణాల్లో పాన్ కార్డు పొందాలనుకుంటున్నారా.. అయితే ఆన్ లైన్ ద్వారా ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి.

4  సంబంధిత ఉపాధ్యాయుని సేవా పుస్తకముతో సర్వీసు రెగ్యులరైజేషన్ మరియు
ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు అప్లికేషను జతపరచాలి.

శ్రీమతి సి.వి.రేణుక, జి.వి.శా., ప.గో.జిల్లా

Form for Sercice regularisation Annexure

Download Attestation form   ||  DDO Covering letter

DEO Proceedings