UPSC నుంచి మరో నోటిఫికేషన్‌.. 344 ఖాళీలు

త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన కంబైన్డ్
డిఫెన్స్ స‌ర్వీస్ (సీడీఎస్‌) ఎగ్జామ్‌-2 నోటిఫికేష‌న్‌ను యూపీఎస్సీ విడుద‌ల
చేసింది. ఇందులో భాగంగా మొత్తం 344 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఆన్‌లైన్
ద‌ర‌ఖాస్తులు ప్ర‌క్రియ ఆగ‌స్టు 5 సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తు
ప్ర‌క్రియ ఆగ‌స్టు 25, 2020 ముగుస్తుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు
ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. సీడీఎస్ ప‌రీక్ష‌ను
యూపీఎస్సీ ప్ర‌తి ఏడాది రెండుసార్లు నిర్వ‌హిస్తుంది. పూర్తి వివరాలకు
www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 344
ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ- డెహ్రాడూన్‌: 100 పోస్టులు
ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ- ఎజిమ‌ల‌: 26 పోస్టులు
ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీ- హైద‌రాబాద్‌: 32 పోస్టులు
ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ- చెన్నై (మెన్‌): 196 పోస్టులు
ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ- మ‌ద్రాస్ (ఉమెన్‌): 17 పోస్టులు
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 25, 2020
దరఖాస్తు ఫీజు: రూ.200
ద‌ర‌ఖాస్తుల‌కు ఉప‌సంహ‌ర‌ణ‌: సెప్టెంబ‌ర్ 1 నుంచి 7 వ‌ర‌కు
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌: ప‌రీక్ష‌కు మూడు వారాల ముందు
పరీక్ష తేది: నవంబర్‌ 8, 2020
వెబ్‌సైట్‌:
www.upsc.gov.in/
Flash...   Deputation to Single school teachers - orders