WHO కీలక ప్రకటన… వీటి ద్వారా కరోనా సోకదు


 
కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనికి సంబందించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను ఆధారంగా చూపింది. ఈ పరిశోధనలో కొన్ని లక్షల ఆహార పదార్థాలు, వాటి ప్యాకేజింగ్‌లపై కరోనా పరీక్ష నిర్వహించారని, వాటిలో అత్యంత తక్కువ ప్యాకేజింగ్‌లపై మాత్రమే కరోనా వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు.

దీంతో ఆహారం విషయంలో భయం అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ తెల్చి చెప్పింది

Flash...   Schools Safety Program - Online link for all Schools