కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆహారం, ప్యాకేజింగ్‌ల ద్వారా కరోనా సోకినట్లు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనికి సంబందించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను ఆధారంగా చూపింది. ఈ పరిశోధనలో కొన్ని లక్షల ఆహార పదార్థాలు, వాటి ప్యాకేజింగ్‌లపై కరోనా పరీక్ష నిర్వహించారని, వాటిలో అత్యంత తక్కువ ప్యాకేజింగ్‌లపై మాత్రమే కరోనా వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు.
దీంతో ఆహారం విషయంలో భయం అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ తెల్చి చెప్పింది