ఆంధ్రజ్యోతి MD V.రాధాకృష్ణకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వాస్తవ దూరంగా వార్తలు ప్రచురించారంటూ ఆంధ్రజ్యోతి ఎండీ
వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్‌కు రాష్ట్ర హైకోర్టులో స్టేట్‌ పబ్లిక్
ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌‌
ప్రభుత్వం జడ్జిల ఫోన్లను ట్యాప్‌ చేయిస్తోందంటూ ‘న్యాయ దేవతపై నిఘా?’ శీర్షికతో
ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి.

దీంతో ఈ కథనాలపై తీవ్రంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆంధ్రజ్యోతి ఎండీ
రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్, కొంగాటి వెంకట శేషగిరిరావు, ఆమోదా
బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ
ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వార్తలు ప్రచురించినందుకు భేషరతుగా క్షమాణలు
చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.

ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన కథనాలు సత్య దూరంగా, అవమానకరంగా ఉన్నాయని
ప్రభుత్వం పేర్కొంది. ఈ కథనాల్లో ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుజేయాలనే అజెండా తప్ప
మరేమీ లేదని ఆరోపించింది. ప్రభుత్వంపై ఇలాంటి వార్తలు ప్రచురించినందుకు గాను
వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంగా న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సి
ఉంటుందని స్టేట్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ & CO కి లీగల్ నోటీస్ పంపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
pic.twitter.com/zQGssu63UN

— 2024YSRCP (@2024YSRCP)
August 15, 2020

Flash...   SBI సరికొత్త పని విధానం..ఇంటి వద్దకే మనీ ప్రారంభం.