ఇక మారటోరియం లేదు…

కరోనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టడంతో ప్రజల ఇబ్బందులను, ముఖ్యంగా వేతన
జీవుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపుపై మారటోరియం
విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)… అయితే, కరోనా కట్టడి
కాకపోవడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ మారటోరియాన్ని
పొడిగిస్తూ వచ్చింది… ఆ మారటోరియం ఈ నెల 31తో ముగిసిపోనుంది. ఇక, ఆ తర్వాత
పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కరోనా
వల్ల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా, మారటోరియంను
పొడిగించడం వల్ల వారి పరపతి తీరు ప్రభావితమవుతుందని ఆర్బీఐ భావిస్తున్నట్టుగా
తెలుస్తోంది. 

దీంతో.. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు అమల్లో ఉన్న ఆర్బీఐ మారటోరియాన్ని ఇక
పొడిగించే అవకాశం లేదంటున్నారు. 6 నెలలకు మించి మారటోరియం పొడిగించడం వల్ల రుణ
గ్రహీతల క్రెడిట్ బిహేవియర్ ప్రభావితమవుతుందని, షెడ్యూల్డ్ పేమెంట్స్
పునఃప్రారంభమైన తర్వాత అపరాథాల ప్రమాదం పెరుగుతుందని భావిస్తున్నట్టుగా
తెలుస్తోంది

Flash...   ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద టీచర్ లకు విశాఖపట్నం లో ట్రైనింగ్ .. ఆదేశాలు జారీ