ఏపీలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ: ఆదిమూలపు సురేష్

 ఏపీలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు.:-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి
ఆదిమూలపు సురేష్.

• రాష్ట్రంలో 2 కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు

• ప్రకాశం జిల్లాలో ప్రారంభంకానున్న టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ 

• విజయనగరంలో మరో కొత్త యూనివర్శిటీ…

• ఈ విద్యా సంవత్సరం నుంచే బోధన ప్రారంభం…

• అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న కళాశాలలు.

• సెప్టెంబర్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు.

• ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు.

• తెలుగు, సంస్కృతం అకాడమీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్.

• త్వరలో 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.

• కళాశాలల్లోనూ ‘నాడు-నేడు’ అమలు : మంత్రి ఆదిమూలపు సురేష్.

సచివాలయం, ఆగస్టు 6 : ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా
రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ వెల్లడించారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీని
ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. 

అక్టోబర్ 15 నుంచి కాలేజీలను తెరుస్తాం

సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి సెట్‌ల నిర్వ‌హ‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్టోబ‌ర్ 15 నుంచి అన్ని కాలేజీల‌ను తెరుస్తామ‌ని విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ
వ‌స్తోన్న సెట్‌ల‌ను సెప్టెంబ‌ర్ 3వ వారం నుంచి నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు.
3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
కళాశాల‌ల్లో నాడు- నేడు కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతామ‌ని తెలిపారు. అన్ని ప్రైవేటు
కళాశాల‌లు ఆన్‌లైన్‌లో అడ్మిష‌న్లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఏవైనా
కాలేజీలు అక్ర‌మాల‌కు పాల్పడితే వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని
హెచ్చ‌రించారు. 

గురువారం ఆయ‌న సచివాల‌యం నుంచి మాట్లాడుతూ.. ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో గ్రాస్
ఎన్‌రోల్‌మెంట్ 70 నుంచి 90 శాతం పెంచాల‌ని సూచించారు. క‌ర్నూలులో క్లస్టర్
యూనివర్సిటీ, కడపలో అర్కిటెక్చర్, తెలుగు సంస్కృత అకాడమీ, కురుపాంలో గిరిజన
ఇంజినీరింగ్ కాలేజీ, పాడేరులో గిరిజన విశ్వ‌విద్యాల‌యాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.
ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని ఆదిమూల‌పు
సురేష్‌ పేర్కొన్నారు

Flash...   వచ్చే ఏడాది నుంచే 'ప్రీ ఫస్ట్ క్లాస్' అమలు... AP ప్రభుత్వం కీలక నిర్ణయం