గాలిలో కరోనాను గుర్తించే ‘డిటెక్టర్‌ బయో’

మాస్కో, ఆగస్టు 30 : గాలిలో కరోనా వైరస్‌ జాడను గుర్తించగల ఓ ప్రత్యేక పరికరాన్ని రష్యా అభివృద్ధి చేసిందంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘ఆర్‌టీ’ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఆ పరికరానికి ‘డిటెక్టర్‌ బయో’ అని పేరు పెట్టారు. ఇది గాలిలోని బ్యాక్టీరియాలు, విష వాయువుల జాడనూ అత్యంత కచ్చితత్వంతో పసిగట్టగలదు. ఆయా వ్యాధి కారకాలు ఎక్కడి నుంచి వెలువడుతున్నాయి? అనే సమాచారాన్ని స్పష్టంగా సూచించగలదు.

ఆగస్టు 28(శుక్రవారం)న మాస్కోలో నిర్వహించిన ‘ఆర్మీ 2020’ కార్యక్రమంలో ప్రఖ్యాత ‘జెనిట్‌’ కెమెరాల తయారీ కంపెనీ ‘కేఎంజెడ్‌’ దీన్ని ప్రదర్శించింది. ఇది చూడటానికి రిఫ్రిజిరేటర్‌లా పెద్దగా ఉంటుంది. ఈ పరికరం 10 నుంచి 15 సెకన్లలోనే గాలిలోని సూక్ష్మక్రిముల జాడను గుర్తించి అప్రమత్తం చేస్తాయి. అయితే కరోనాలాంటి ప్రమాదకర వైర్‌సలను గుర్తించేందుకు గంటన్నర నుంచి రెండు గంటల సమయాన్ని తీసుకుంటుంది. మెట్రోలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, కార్యాలయాలు వంటిచోట్ల  ‘డిటెక్టర్‌ బయో’ను వాడొచ్చని దీన్ని తయారుచేసిన ‘కేఎంజెడ్‌’ కంపెనీ తెలిపింది. 

Flash...   27 % IR తో.. ప్రభుత్వ సొంత ఆదాయాన్ని మించిపోయిన జీతాలు