జాతీయ విద్యావిధానంపై సలహాలివ్వండి – Suggestions on NEP 2020


జాతీయ విద్యావిధానం-2020 పై కేంద్ర విద్యాశాఖ క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ,
ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు
స్వీకరిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న జాతీయ విద్యా విధానం మరింత పటిష్టంగా ఉండేందుకు
ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధిగమిస్తూ అత్యుత్తమ
పాలసీని తీర్చిదిద్దేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని భావిస్తోంది. ఇందులో
భాగంగా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్ రాష్ట్రాల విద్యాశాఖ
కార్యదర్శులకు లేఖ రాశారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గూగుల్‌లో
https://innovateindia.mygov.in/nep2020
పేజీ తెరిచి ముందుగా తమవివరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అధ్యాయాల వారీగా
సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియ ఈనెల 24వ తేదీ నుంచి 31వ తేదీలోగా
పూర్తి చేయాలన్నారు. ఈ విధంగా వచ్చిన సలహాలను నిపుణుల కమిటీలో చర్చించి నిర్ణయం
తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Flash...   సేవింగ్స్ అకౌంట్ నుంచి అధిక రాబడి పొందేదెలా… 5 టిప్స్ మీకోసం..