ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష.. Score Card మూడేళ్లు వాలిడిటీ.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ
ఓకే పరీక్ష రాస్తే సరిపోతుంది. అంతేకాదు, ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును
మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కామన్‌
ఎలిజిబిలిటీ టెస్ట్ (CET) నిర్వహించేందుకు ‘జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ’ (National Recruitment Agency) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం (ఆగస్టు 19) ఆమోదం తెలిపింది

One Nation One Exam

Excellent news for all those candidates who are willing to build their career in Government department, A Single Window Exam For Government Jobs , On 14 March 2018 Government of India has planned a Bill in the Rajya Sabha requesting for a Common Eligibility Test (CET) to choose brilliant contenders for Group B (Non-Gazetted) posts and below level posts in the Government of India.

ప్రభుత్వ రంగ సంస్థల్లో నాన్-గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో
వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఇవపై ఎన్‌ఆర్‌ఏ కామన్ ఎలిజిబిటిటీ టెస్ట్
నిర్వహిస్తుంది. వివిధ ఉద్యోగ నియామకాల్లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే
ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ స్కోరు కార్డుకు మూడేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది.
ఈలోగా జాబ్ రాకపోతే అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాసుకోవచ్చు.

దేశంలో ఏటా ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 1.25 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు
విడివిడిగా విడుదల అవుతున్నాయి. వీటి కోసం ఏటా సుమారు 2.5 కోట్ల మంది పోటీ
పడుతున్నారు. వీరంతా ఆయా బోర్డులు నిర్వహించే పరీక్షలు రాస్తున్నారు. కొత్త
విధానం ద్వారా ఇకపై ఇలాంటి వారంతా ఒకే ఎగ్జామ్ రాసి ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు
చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

Flash...   DEO OFFICE IT CELL ‌లో అడ్డగోలు నియామకాలు..!

ఆన్‌లైన్ ద్వారా పరీక్ష (CET) నిర్వహించి రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను
విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావాలంటే ఆ మెరిట్ జాబితాను
ఉపయోగించుకొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా విధానాన్ని
రూపొందిస్తున్నారు.

ఈ విధానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు

✧ ఇప్పటివరకు ప్రభుత్వ రంగానికి చెందిన వివిధ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే
అభ్యర్థులు వివిధ పరీక్షలు రాస్తున్నారు. ఇకపై ఒకటే కామన్ పరీక్ష రాస్తే
సరిపోతుంది.

✧ వేర్వేరు బోర్డులు నిర్వహించే పరీక్షలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఉద్యోగార్థులు
కూడా అందుకనుగుణంగా ప్రతి పరీక్షకు విడిగా ప్రపేర్ కావాల్సి వస్తోంది. ఒకే పరీక్ష
నిర్వహిస్తే అభ్యర్థులకు ఈ తిప్పలు తప్పుతుంది.

✧ వివిధ రకాల ఉద్యోగాల కోసం కోచింగ్‌, మెటీరియల్‌కు వేల నుంచి లక్షల రూపాయల వరకు
ఖర్చు చేయాల్సి వస్తోంది. నిరుద్యోగులకు ఇది తలకు మించిన భారమవుతోంది. పేదరికంతో
కొట్టుమిట్టాడుతున్న యువకులు తమకు ప్రతిభ ఉన్నా.. పోటీ పడలేక రాజీపడి చిన్న
ఉద్యోగాల్లో కుదురుకుంటున్నారు. తాజా నిర్ణయం వారికి ప్రయోజనం కలిగించనుంది.

✧ ఒకే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులకు డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
తొందరగా కెరీర్లో కుదురుకోవడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులపై
ఒత్తిడి తగ్గుతుంది.

✧ మెరిట్ లిస్ట్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్ల అటు ప్రభుత్వ రంగ సంస్థలు,
బ్యాంకులకు కూడా నియామక ప్రక్రియ సులభమవుతుంది. ఖాళీలు ఏర్పడగానే మెరిట్ జాబితా
నుంచి కొంత మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూలు నిర్వహించి ఎంపిక
ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు ఉంది.

✧ వివిధ ఉద్యోగాల్లో ఖాళీలను వేగంగా పూర్తి చేయడానికి ఈ ప్రక్రియ ఎంతగానో
ఉపయోగపడుతుంది.

ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు గురించి ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగంలోనే ప్రస్తావించారు.
ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కలిపి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేలా
ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్
ప్రసంగంలో పేర్కొన్నారు. తాజా నిర్ణయం దేశంలో ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు
ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ పేర్కొన్నారు.

Flash...   Status of your Traffic e-Challan Online - Payment - Wrong Challan process