కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్
కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వైరస్ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం
వెలుగులోకి వస్తోంది. భారత్‌లో రోజుకు 60 నుంచి 70వేల పాజిటివ్ కేసులు
నమోదువుతున్నా.. రోజుకు వెయ్యి లోపు మంది మాత్రమే చనిపోతున్నారు. ఇది సంఖ్యా
పరంగా చూస్తే తక్కువే. అయినా భారత్ జనాభాతో పోలిస్తే తక్కువ అని తాజాగా ఓ
అధ్యయనం వెల్లడించింది.
అయితే ప్రపంచ దేశాలకన్నా భారత్‌లో తక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే
తక్కువ మరణాలు సంభవించడాన్ని ఢిల్లీ, మంగళూరుకు చెందిన వైద్య నిపుణులు
ఆసక్తికరమైన అంశాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్
పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన ఓ కథనం పేర్కొంది.
వ్యాసాన్ని రాశారు.
తక్కువ స్థాయిలో ఏసీల వాడకం, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా సౌకర్యం ఉండటం
వైరస్ ప్రభావం తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ది
చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఏసీ గదుల్లో చాలా తక్కువ సమయం గడుపుతారని, ఇది
ఆసియా దేశాల్లో తక్కువ సంఖ్యలో కరోనా మరణాలకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.
ఐరోపా దేశాల్లో మొదట్లో కేసుల సంఖ్య చాలా అధికంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో అక్కడి
వాతావరణం చలిగా ఉండటంతో వారు ఎక్కువగా మూసివున్న గదులకే పరిమితం అయి ఉండవచ్చని
సర్ గంగారామ్ ఆంకాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ శ్యామ్ అగర్వాల్
వెల్లడించారు.
కాగా, గాలి, వెలుతురు తగినంతగా లేని, అలాగే గదుల్లో వైరస్ సోకిన వ్యక్తులు ఉండటం
వల్ల గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని చెప్పలేమని జులైలో ప్రపంచ
ఆరగ్య సంస్థ హెచ్చరించింది. మూసివున్న, పూర్తిగా ఏసీతో నింపేసిన భవనాలకు వీలైనంత
వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నప్పటికీ, అవి మరణాల సంఖ్య పెరిగేందుకు
కారణం అవుతున్నాయనే విషయంపై స్పష్టత లేదన్నారు.
మరో పక్క కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా పెరుగుదోందని కేంద్ర ఆరోగ్యశాఖ
మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే మహమ్మారిని తేలికగా తీసుకోవద్దని కూడా
హెచ్చరించారు. ప్రపంచంలో అత్యల్ప మరణాలు భారత్‌లోనే నమోదవుతున్నాయన్న ఆయన రికవరీ
రేటు భారీగా పెరుగుతోందన్నారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే కరోనా విషయంలో భారత్
ఎంతో మెరుగ్గా ఉందని అన్నారు.