ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ ప్రయత్నాలు

విజయవాడ స్వర్ణ పాలెస్ హోటల్ అగ్ని ప్రమాదం కేసుకు సంబందించి రమేష్ ఆస్పత్రి
యజమాని డాక్టర్ రమేష్ బాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ 21 వ
తేదీకి వాయిదా పడినట్లు సమాచారం వచ్చింది.

గత కొద్ది రోజులుగా రమేష్ బాబు పరారీలో
ఉన్నారని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.రమేష్ అరెస్టు కాకుండా ఉండడానికి
గత కొద్ది రోజులుగా పలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్
ఇస్తుందా?లేదా అన్నది చూడాలి. అగ్ని ప్రమాదంలో పది మంది మరణించిన సంగతి
తెలిసిందే.

Flash...   RPS 2022 Employee and Pensioners Pay slips Link Released