కేంద్రం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది.
స్కూళ్లు, కాలేజీలను మరి కొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది.
మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులు ప్రకటించింది.
తాజా మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.