రష్యన్ వ్యాక్సిన్ పని చేస్తే మనం అదృష్టవంతులమే ! సీసీఎంబీ

రష్యా అభివృధ్ది పరచిన కరోనా వైరస్ వ్యాక్సీన్ సమర్థంగా పని చేస్తే మనం
నిజంగా అదృష్టవంతులమేనని  సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్
బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ కె.మిశ్రా..

రష్యా అభివృధ్ది పరచిన కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తే మనం నిజంగా
అదృష్టవంతులమేనని  సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
(సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ కె.మిశ్రా అన్నారు. ఈ వ్యాక్సిన్ డేటా లేనిదే ఇది
కరోనా రోగులకు పవర్ ఫుల్ మందుగా పని చేస్తుందా అన్న విషయాన్ని ఇప్పుడే
చెప్పలేమన్నారు. కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే వ్యాక్సీన్ ని ప్రపంచంలో తామే
మొట్టమొదటిసారిగా డెవలప్ చేశామని, దీన్ని తమ కూతురికి ఇవ్వగా ఎలాంటి సైడ్
ఎఫెక్ట్స్ రాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్పై
అప్పుడే నిపుణులు సందేహాలు లేవనెత్తుతున్నారు.

రష్యన్లు ఈ వ్యాక్సిన్ సేఫ్టీపై కఛ్చితమైన హామీనివ్వడంలేదని, వాళ్ళు మూడో దశ
ట్రయల్ ని నిర్వహించినట్టు కనబడడంలేదని రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. ఎక్కువమంది
వాలంటీర్లపై దీన్ని టెస్ట్ చేసి రెండు నెలలపాటు వేచి చూడాలని, ఆ తరువాత వారిలో
వైరల్ ఇన్ఫెక్షన్ సోకిందా..నశించిందా  యాంటీ బాడీలు పెరిగాయా..ఇలాంటివన్నీ
పరిశీలించవలసి ఉందని ఆయన చెప్పారు. రష్యన్లు ఇవన్నీ చేసి ఉంటారనుకోను అని ఆయన
అభిప్రాయపడ్డారు.

Flash...   Academic Calendars for 2022-23 . For Foundation / High Schools