ఈ నెల (September) 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు..12 నుంచి హాల్ టికెట్స్

కరోనా కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి
నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి 26వ
తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి
శిక్షణ తరగతులు కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో
జరుగనున్నాయి.

19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో
2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు
వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12
నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168
మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి.

ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్‌ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Flash...   SR ENTRIES: మీ S.R. లో అన్ని ఎంట్రీస్ ఉన్నాయా?