ఈ బ్యాటరీని ఒకసారి రీచార్జ్ చేస్తే… 28వేల సంవత్సరాలు పనిచేస్తుందట.

 మాములుగా బ్యాటరీని ఒకేసారి రీఛార్జ్ చేస్తే నాలుగు నుంచి 8 గంటలు లేదంటే
రోజు లేదా రెండు రోజులు వస్తుంది.  అదే మోటార్ వెహికిల్ బ్యాటరీ అయితే
ఛార్జ్ చేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం వస్తుంది.  కానీ, ఈ బ్యాటరీని
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 28వేల సంవత్సరాలు పనిచేస్తుందని తయారీ సంస్థ
ప్రకటించింది.  

క్యాలిఫోర్నియాకు చెందిన ఎన్డిబి సంస్థ అణు వ్యర్ధాలతో బ్యాటరీని తయారు
చేసింది.  కృత్రిమ వజ్రంతో తయారు చేసిన చిన్న పెట్టెలో కార్బన్ 14
అణువ్యర్ధాలతో ఈ బ్యాటరీని తయారు చేశారు.  దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే
28వేల సంవత్సరాల వరకు పనిచేస్తుందని చెప్తున్నారు.  

ఎలక్ట్రానిక్ వాహనాలకు, మొబైల్ ఫోన్లకు, గడియారాలు, ఇంటి విధ్యుత్ వంటి వాటికి ఈ
బ్యాటరీని వినియోగించవచ్చని నిపుణులు చెప్తున్నారు.  ప్రపంచంలో 33 మిలియన్
క్యూబిక్ మీటర్ల అణువ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయని, ఈ వ్యర్ధాలతో ఇలాంటి
బ్యాటరీలు తయారు చేస్తే ప్రపంచం విధ్యుత్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం
లభిస్తుందని అంటున్నారు.

Flash...   Income Tax: మీ ఆదాయపన్నుని ఇన్కమ్ టాక్స్ అధికారిక వెబ్సైటు లో ఈజీ గా ఇలా లెక్కించండి.. !