డిస్‌లైక్స్‌ టు డైవర్షన్స్‌ ..! – తెలకపల్లి రవి

కరోనావ్యాప్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి ఎగబాకిన భారత దేశ పరిస్థితిపై అంతా
ఆందోళన చెందుతుంటే ప్రజల దృష్టి మళ్లించడమెలాగని మోడీ ప్రభుత్వం ఆరాటపడుతున్నది.
తొలిదశలో చాలా ఆర్భాటంగా వీడియో కాన్ఫరెన్సులు, చప్పట్లు దీపాలు
వెలిగించడానికి  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ సరైన వ్యూహం అనుసరించలేదని
కొద్ది కాలంలోనే తేలిపోయింది. ఏకపక్షంగా నిర్నయించిన లాక్‌డౌన్లు అన్‌లాక్‌
ప్రహసనం పరిమిత ఫలితాలే ఇచ్చింది.  ఆర్థిక వ్యవస్థ ఆ దెబ్బతో పూర్తిగా
కుదేలై పోయింది. ప్రజారోగ్యానికి ప్రధానంగా బాధ్యత వహించవసిన రాష్ట్ర ప్రభుత్వ
ఖజనాలు  ఖాళీ అయ్యాయి. అరకొరగా సర్కారు చికిత్స, అతి ఖరీదైన కార్పొరేట్‌
వైద్యం మధ్య ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి ఉద్యోగాలు పోయి జీతాలు రాక వచ్చినా
పాక్షికమై సామాన్య జనం ఘోషిస్తున్నారు. ఇన్ని సంకటాలు సంక్షోభాల  తర్వాత
మన్‌కీ బాత్‌లు చేదై మోడీకి డిస్ లైక్‌లు పెరిగిపోతున్నాయి.

కేంద్రంలో బైఠాయించి కరోనాను అరికట్టడం తమ ఘనత అని జబ్బు చరుచుకున్న జమాజెట్టిలే
అంతా దైవకృతం విధి లిఖితం అంటూ రాష్ట్రాల ను మీ తంటాలు మీరు పడమని ప్రకటించడం
ఇందుకు పరాకాష్టగా మారింది. కేరళ తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు కేంద్ర విధానం
ఆమోదయోగ్యం కాదని ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాయి. కేంద్ర విధానాలలో 
కార్పొరేట్‌ పక్షపాతం  కష్టజీవుల పట్ల వివక్ష కళ్లకు కట్టినట్టు
వెల్లడయ్యాయి. వేల  కోట్లు గడించిన  ప్రైవేటు టెల్‌కామ్ యాభై
వేల  కోట్ల  పాత బకాయిలు  కట్టడానికి పదేళ్లు వ్యవధి ఇచ్చిన
కేంద్రం మామూలు  మనుషుల  ఇఎంఐను రెండేళ్లు వాయిదా వేయడానికి
తకిందులవుతోంది. బ్యాంకులు  వేల  కోట్లు బడాబాబులకు బాకీలు  రద్దు
చేస్తాయి. వ్యవసాయ రంగం గురించి సూక్తులు  వినిపిస్తారు గాని ఉచిత విద్యుత్‌
వచ్చేచోట కూడా అడ్డు పడే షరతు పెడుతున్నారు.  విద్యుత్‌,రేషన్‌,స్థానిక
సంస్థలు, ఇవోడి నాలుగు రంగాలలోనూ  కేంద్రం  విషమ షరతులు విధించడమే గాక
విద్యారంగాన్ని ఏకపక్షంగా హానికరంగా మార్చేసింది..ప్రధాని స్వంత పునాదిగావున్న
గుజరాత్‌ కూడా విద్యుత్‌ విషయంలోనూ  పిపిఎ సమీక్ష లోను  కేంద్ర
విధానాన్ని తోసిపుచ్చింది.

Flash...   శానిటేషన్' నుంచి టీచర్లను మినహాయించాలి

రాజకీయంగానూ బీజేపీని ఇబ్బంది పెట్టే చాలా విషయాలు  ఈ కాలంలో బహిర్గతమైనాయి.
పేస్‌బుక్‌ యాజమాన్యం  బిజెపితో  కుమ్కక్కవడం  అంతర్జాతీయ చర్చగా
మారింది. భారత దేశంలో వారి అధికారిణి అంఖిదాస్‌..  మోడి ప్రచార భారం మోస్తూ
సిబ్బందికి లేఖలు  రాసినట్టు వెల్లడైంది. ఆత్మరక్షణ స్తితిలో పడిన కేంద్రం
ఫేస్‌బుక్‌ మితవాదానికి వ్యతిరేకంగా వుందంటూ మంత్రి రవిశంకర్ ‌ప్రసాద్‌తో లేఖ
రాయించి ఎదురుదాడికి దిగాల్సివచ్చింది. సిఎఎ వ్యతిరేక ఆందోళనపై అభ్యంతర
వ్యాఖ్యలు  చేసిన బిజెపి నేత కపిల్‌ మిశ్రా చేతుల  మీదుగా  ఒక
పుస్తకావిష్కరణ పెట్టుకుంటే ప్రచురణ సంస్థ బూల్స్‌బర్రీ ఆఖరులో రద్దు చేసింది.
యుపిలో  ఇదే విషయమై అన్యాయంగా అరెస్టు చేసిన ప్లి వైద్య నిపుణుడు డా.కఫీల్‌
ఖాన్‌ను హైకోర్టు విడుద చేసింది.కేరళలో బంగారం స్మగ్లింగ్‌ కేసులో అన్యాయంగా
ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కేంద్రీకరిస్తే బిజెపి వారికి అనుకూమైన టీవీ
సంపాదకుడి హస్తం వున్నట్టు వెల్లడై  తను తొలగించబడాల్సి వచ్చింది. 

ఎపిలో నైతే రాజధాని విషయంలో బిజెపి ద్వంద్వనీతి ప్రత్యేకంగా విమర్శనెదుర్కొంది.
తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా ఎపి క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయాయని బిజెపి ఎంపి
బండి సంజయ్‌  మాట్లాడుతున్నారు. తెలంగాణలో బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ ఖాతాను
పేస్‌బుక్‌ తొగించాల్సి వచ్చింది. అమెరికాలో   భారతీయ నేపథ్యం గల
కమలాహారిస్‌ ప్రత్యర్తి పక్షమైన డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్తిగా వుండగా
ట్రంప్‌కు అనధికార ప్రచారకుడుగా ప్రధాని మోడీ చిత్రాలను ఉపయోగించడం మరో తంతుగా
మారింది.

ఇదే సమయంలో అంతర్గత కలహాలలో మునిగిన కాంగ్రెస్‌ నేతు మీరు బిజెపి అనుకూలమంటే మీరే
వత్తాసుదార్లని పరస్పరం ఆరోపించుకుంటున్నారు.  టిఆర్‌ఎస్‌ ఇటీవల  కొంత
వ్యతిరేకిస్తున్నా ఇతర ప్రాంతీయ పార్టీలైన  వైసీపీ ,టిడిపి, జనసేన 
దానితో ప్రత్యక్ష పరోక్ష  స్నేహానికి పాకులాడుతున్నాయి, బిజెడి 
,జెడియు, ఎడిఎంకె వంటివి కూడా అదే తరహాలో వుంటున్నాయి. ఇలాంటి పార్టీల 
సంగతి ఎలా వున్నా ప్రజల ముందు  ప్రతికూలాంశాలు  ఆవిష్కతం కావడం
బిజెపికి ఇరకాటంగా మారింది. ప్రజల  దృష్టి మరల్చేందుకు అవాంచనీయ
వివాదాలు  ముందుకు రావడాన్ని ఈ పూర్వరంగంలోనే చూడవలసి  వుంది.
చారిత్రకంగా చైనాతో వున్న వివాదాన్ని అతిగా చిత్రించడం అందులో మొదటిది. రక్షణ
మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలో చైనా మంత్రి ఫెంగ్‌ వీతో చర్చలు  జరపడం
సహా అనేక స్థాయిల్లో సంభాషణలు  సాగుతున్నా మీడియాలో మాత్రం యుద్ధం
వచ్చేసినట్టే కథలు దట్టించబడుతున్నాయి. మోడీ హయాంలో ఇండియా వైఖరి2017 డోకలం ఘటన
నాటినుంచి  మారిందనీ, సరిహద్దులో ఇప్పటివరకూ అనుసరించిన పరస్పర
సర్దుబాటు  మాయమై దూకుడు పెరిగినందునే తామూ స్పందిస్తున్నామని చైనా వివరణగా
వుంది. ఇరుదేశాలు  శాంతియుత చర్చల తో పరిష్కరించుకోవలసిందేనని
విదేశాంగమంత్రి జైశంకర్‌ కూడా చెబుతున్నా సైనికాధికారి ఘాటు  వ్యాఖ్యలు
చేస్తున్నారు.  

Flash...   One day workshop to SLCCs and District teams on We Love Reading

చైనాతో జరగని యుద్ధంలో అమెరికా మనవైపు తిరిగిపోయిందనే వూకదంపుడు సాగిస్తూ 
దాని పర్యవసానాలు  కప్పిపుచ్చుతున్నారు. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌
ఆత్మహత్య ఘటనపై అంతులేని ఫోకస్‌…  చైనా సమస్య కంటే ఉధృతంగా వుంది.
గట్టిగా వేగంగా దర్యాప్తు జరిపి నిజానిజాలు  తేల్చేబదులు  రసవత్తరమైన
కథతో ఉత్కంఠ భరితమైన  డైలీ సీరియల్‌గా మార్చేశారు. స్పష్టత లేని వాక్సిన్‌
రాకడపై కథలు  మరో రకం. భద్రత బాధ్యత లేకుండా విద్యార్తులకు పరీక్షలు 
జరపాలని నిర్నయించి అదేదో వారి శ్రేయస్సు కోసమేనని గొప్పగా చెప్పుకోవడం పరీక్షలలో
ముంచేస్తే  పట్టించుకోబోరని వ్యూహం తప్ప వైరస్‌ గురించిన ఏమంత చింత లేదన్న
మాట, ఒక వంక 24 శాతం వరకూ జిడిపి పడిపోయి భవిష్యత్తు అయోమయంగా  మారినప్పుడు
ఎన్ని వ్యూహాలు  పన్నినా  చెల్లుబాటు కావడం కష్టమేనని పెరిగిపోతున్న
డిస్ ‌లైక్ లు చెబుతున్నాయి. – తెలకపల్లి రవి
SOURCE – NTV