విద్యాహక్కు చట్టం : పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు ?

 విద్యాహక్కు చట్టం : పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు ? ప్రభుత్వాన్ని
ప్రశ్నించిన హైకోర్టు
 

తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. 2010 నుంచి
పెండింగులో ఉన్న పలు పిల్స్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం పూర్తి
వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిగా… పదేళ్ళ నుంచి ఏం
చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలవుతుందా? లేదా అని
హైకోర్టు ప్రశ్నించింది. నిధులు, ఖర్చులు వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని
రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి వెల్లడించలేదని రాష్ట్ర ప్రభుత్వం
కోర్టుకు దృష్టికి తెచ్చింది. బడ్జెట్ వివాదాలను ఈనెల 17 లోగా పరిష్కరించుకోవాలని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది హైకోర్టు. ఈనెల 18న తుది విచారణ
చేపడతామని హైకోర్టు చెప్పింది.

Flash...   SUMMER HEAT: భానుడి ప్రతాపం.. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు బ్రేక్ చేయొచ్చు--IMD అంచనాలివే