అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు – మంత్రి ఆదిమూలపు సురేశ్

 అమరావతి – ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు
తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి
ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో
స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే 9వ తరగతి నుంచి ఇంటర్
వరకు క్లాసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి మేరకే
క్లాసుల్లోకి అనుమతించామన్నారు. 

50 శాతం మంది ఉపాధ్యాయులనే హాజరు కావాలని
చెప్పామన్నారు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల అనంతరం పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల
సేవలు ఉంటాయని తెలిపారు. లెక్చరర్ల జీతాలపై సీఎం జగన్ నిర్ణయం మేరకు
నడుచుకుంటామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. విద్య, అధునీకరణకు సంబంధించి అన్నీ
సిద్ధం చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు

Flash...   SSC EXAMS NR SUBMISSIONS - LOGIN PROBLEMS HELP LINES NUMBERS