ఇక డ్రైవింగ్‌ లైసెన్స్ పొందడం సులభం…

అక్టోబర్‌ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ , ఆరోగ్య బీమా వరకూ అమలవనున్న పలు
నూతన నిబంధనలు ఇవే. టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు
పన్ను. అయితే నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్సు పొందడం సులభతరం .
గురువారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు,
“ఈ-చలాన్‌”ను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరచాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు
పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయు. హార్డ్‌ కాపీని అధికారులకు ఇవ్వాల్సిన అవసరం
లేదు. అనర్హతకు గురైన డ్రైవింగ్‌ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను
“ఈ పోర్టల్‌”లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు. 

ఇక “ఆరోగ్య బీమా” రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు బీమా నియంత్రణ సంస్థ
ఐఆర్‌డీఏ వెల్లడించింది. వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా బీమా కంపెనీలు
పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్‌కూ బీమా కవరేజ్‌ వర్తిస్తుంది. ఇక బీమా
క్లెయిమ్‌లను కంపెనీలు అన్ని సులభంగా పరిష్కరించనున్నాయి.

అయితే అక్టోబర్‌ 1 నుంచి టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్‌ సుంకాలను కేంద్ర
ప్రభుత్వం విధించనిది. ఈ తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల
టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి. విదేశాల్లో చదువుకునే
పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా
5 శాతం పన్ను విధించనున్నారు. ఆర్‌బీఐ రెమిటెన్స్‌ పథకం కింద విదేశాలకు పంపే
మొత్తాలపై టీసీఎస్‌ చెల్లించాలని “ఫైనాన్స్‌ చట్టం, 2020” లో వెల్లడించింది

Flash...   WEIGHT LOSS FOOD: బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఈ ఆహారాన్ని తినండి..?