మాములుగా బ్యాటరీని ఒకేసారి రీఛార్జ్ చేస్తే నాలుగు నుంచి 8 గంటలు లేదంటే
రోజు లేదా రెండు రోజులు వస్తుంది. అదే మోటార్ వెహికిల్ బ్యాటరీ అయితే
ఛార్జ్ చేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం వస్తుంది. కానీ, ఈ బ్యాటరీని
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 28వేల సంవత్సరాలు పనిచేస్తుందని తయారీ సంస్థ
ప్రకటించింది.
క్యాలిఫోర్నియాకు చెందిన ఎన్డిబి సంస్థ అణు వ్యర్ధాలతో బ్యాటరీని తయారు
చేసింది. కృత్రిమ వజ్రంతో తయారు చేసిన చిన్న పెట్టెలో కార్బన్ 14
అణువ్యర్ధాలతో ఈ బ్యాటరీని తయారు చేశారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే
28వేల సంవత్సరాల వరకు పనిచేస్తుందని చెప్తున్నారు.
ఎలక్ట్రానిక్ వాహనాలకు, మొబైల్ ఫోన్లకు, గడియారాలు, ఇంటి విధ్యుత్ వంటి వాటికి ఈ
బ్యాటరీని వినియోగించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలో 33 మిలియన్
క్యూబిక్ మీటర్ల అణువ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయని, ఈ వ్యర్ధాలతో ఇలాంటి
బ్యాటరీలు తయారు చేస్తే ప్రపంచం విధ్యుత్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం
లభిస్తుందని అంటున్నారు.